Dhanush-Aishwarya : కోలీవుడ్ మాజీ దంపతులు ధునుష్-ఐశ్వర్య లు మళ్లీ కలవబోతున్నారని చాలా రోజుల నుంచి వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ ఏడాది జనవరిలో విడిపోయినట్లు ప్రకటించిన ధనుష్-ఐశ్వర్యలు… ఇప్పుడు తమ విడాకులను రద్దు చేసుకోవాలనుకుంటున్నట్లు మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే పిల్లల కోసమే వీరిద్దరూ వెనక్కి తగ్గారని, త్వరలోనే మళ్లీ కలిసే ఆలోచనలో ఉన్నట్లు ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి.
అయితే ఈ వార్తలపై ఇప్పటి వరకూ ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. ఈ క్రమంలోనే ధనుష్ తండ్రి కస్తూరి రాజా విడాకులు రద్దుపై పరోక్షంగా స్పందించారు. ధనుష్ కు తన పిల్లల సంతోషమే ముఖ్యం అంటూ విడాకుల వార్తలపై స్పందించారు. దీంతో విడాకులు రద్దుపై వస్తున్న వార్తలు నిజమేనంటూ ఈ జంట్ ఫాలోవరస్ సంబరపడిపోతున్నారు.
Dhanush-Aishwarya : ధునుష్-ఐశ్వర్య గృహ ప్రవేశం..
ఈ క్రమంలోనే ఓ ఆసక్తికర అప్ డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ధనుష్ ఓ కొత్త ఇంటిని కొనుగోలు చేస్తున్నాడని, విడాకుల రద్దు ప్రకటన తర్వాత ఐశ్వర్య, ధనుష్.. పిల్లలతో కలిసి ఆ ఇంట్లో ఉండబోతున్నారని అందుకోసం అన్ని సిద్ధం చేసుకున్నారని తెలుస్తోంది. ఆ ఇంటి విలువ 100 కోట్ల రూపాయలని, వచ్చే ఏడాది జనవరిలోనే గృహ ప్రవేశం చేయబోతున్నరాని సమాచారం. మరి ఈ వార్తలో నిజం ఎంత ఉందో తెలియాలంటే ఇంకా కొంత కాలం ఆగాల్సిందే.