Guppedantha Manasu: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో రిషి జోబులో రోజ్ ఫ్లవర్ గురించి మాట్లాడుతూ ఉంటాడు.
మహేంద్ర రిషి జోబులో ఉన్న గులాబీ పువ్వుని వదులుకుంటావా అని అనగా అప్పుడు రిషి అనుకోకుండా నా దగ్గరికి వచ్చిన దానిని ఎలా వదిలి పెడతాను డాడ్ అని అంటాడు. ఆ తర్వాత రిషి ఆ రోజా పువ్వు ని తీసుకెళ్లి హార్ట్ సింబల్ దగ్గర పెట్టడంతో మహేంద్ర ఎందుకు అని ప్రశ్నించగా ముక్కలైన మనసు దగ్గర వాడిపోయిన పువ్వు పెట్టడం మంచి కాంబినేషన్ అని అంటాడు రిషి.
మరొకవైపు ధరణి, గౌతమ్ ఇద్దరూ సరదాగా మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలోనే దేవయాని అక్కడికి రావడంతో ఇద్దరూ సైలెంట్ అయిపోతారు. అప్పుడు దేవయాని,ధరణి పై విరుచుకు పడుతుంది. వంటలు చేయకుండా ఈ మీటింగ్ లు ఏంటి అంటూ మండిపడుతుంది.అప్పుడు గౌతమ్ ఇవాళ రిషికి నేనే భోజనం తీసుకొని వెళ్లి ఇస్తాను అని అంటాడు.
మరొకవైపు రిషి కాలేజ్ కి వచ్చిన తర్వాత అక్కడి గోడలపై రోజా పూలతో దారులు ఉంటాయి. ఇక ఆ దారుల వెంట రిషి వెళ్లగా అక్కడ క్లాసులో వసు పువ్వులతో డెకరేషన్ చేసి రిసీట్ వెల్కమ్ చెబుతుంది. క్లాస్ రూమ్ లోకి వెళ్ళిన తర్వాత రిషి సైలెంట్గా ఉండి అంత గమనిస్తూ ఉంటాడు.
అప్పుడు వసు తన గురించి తాను పొగుడుతూ ఉండగా రిషిని చూసి వెంటనే భయపడి పడిపోతుండగా వెంటనే రిషి పట్టుకుంటాడు. ఆ తర్వాత గౌతమ్ రిషి కోసం భోజనం తీసుకొని వచ్చి వసుని కూడా భోజనం చేయడానికి రమ్మని పిలువగా వసు రాను అని అంటుంది.
ఆ తర్వాత గౌతమ్ చేతిలో ఉన్న టిఫిన్ బాక్స్ కింద పడిపోవడంతో వెంటనే వసుధార నేను టిఫిన్ బాక్స్ ఇచ్చాను అని రిషి సార్ కీ చెప్పవద్దు అని అంటుంది. ఆ తర్వాత జగతి మహేంద్ర ఇద్దరూ రిషి తో కలిసి భోజనం చేయడానికి వెళుతుండగా జగతి అడ్డుకుంటుంది. ఆ తర్వాత వసుకీ తిన్నావా లేదా అని మెసేజ్ పెడతాడు రిషి.
కానీ వసు ఆ మెసేజ్ చదివే లోపే డిలీట్ చేస్తాడు. ఆ తర్వాత గౌతమ్ అన్నం వడ్డిస్తూ ఉండగా అందులో కొంచం అన్నం వదిలే ఎక్కడనుంచి తీసుకొచ్చావు అక్కడ ఇవ్వు అనడంతో గౌతం ఆశ్చర్యపోతాడు. ఇక రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.