...

Guppedantha Manasu: మరొక ప్లాన్ వేసిన సాక్షి.. దగ్గరవుతున్న రిషి, వసు..?

Guppedantha Manasu: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో గౌతమ్, తెచ్చిన భోజనం వసు దే అని తెలుసుకుని అక్కడే ఇచ్చిరాపో అని చెబుతాడు రిషి.

ఈరోజు ఎపిసోడ్ లో రిషి,వసు ఇచ్చిన బాక్స్ లో కొంచెం తిని అక్కడి నుంచి బయటకు వెళ్తూ ఉండగా వసు ఎదురు పడుతుంది. అప్పుడు రిషి గతంలో వసు తనతో మాట్లాడిన మాటలను గుర్తు తలుచుకొని బాధపడుతూ అక్కడనుంచి వెళ్ళి పోతాడు. ఆ తర్వాత వసు,గౌతమ్ దగ్గరికి వెళ్లి రిషి సార్ తిన్నాడా అని అడిగగా గౌతం తిన్నాడు అని చెప్పడంతో సంతోషంగా అక్కడి నుంచి వెళ్లి పోతుంది.

ఆ తరువాత వసుధార రెస్టారెంట్ లో రిషి కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. అప్పుడే రిషి రావటంతో అప్పుడు వసు కాఫీ, ఐస్ క్రీమ్ కావాల్ల సార్ అని అనగా అప్పుడు రిషి అలా ఎవరైనా చేస్తారా అని అనడంతో వెంటనే వసు కస్టమర్ ఎలా చెప్తే అలా చేయడమే మా పని కాదు సార్ అని అనగా అప్పుడు ఋషి నేను కష్టమర్ మాత్రమేనా ఇంకేమీ అవ్వనా నీకు అని అడిగినట్లు ఊహించుకుంటుంది.

మరోవైపు రిషి కారులో ప్రయాణిస్తూ జగతి మాట్లాడిన మాటలు తలుచుకుంటూ తనకు తెలియకుండానే వసు రెస్టారెంట్ దగ్గరికి వస్తాడు. వెంటనే తను వచ్చిన ప్లేస్ చూసి షాక్ అవుతాడు. తనకు తెలీకుండానే వసు రెస్టారెంట్ దగ్గరికి వచ్చాను అని అనుకుంటాడు. అప్పుడే వసు బయటకు రావటంతో ఇదంతా భ్రమ అని అనుకుంటాడు. కానీ వసు కు ఫోన్ రావటంతో తను నిజంగానే ఉంది అని అనుకుంటాడు.

ఆ తరువాత వసు కూడా రిషిని చూసి అక్కడికి వస్తుంది. కాఫీ తాగడానికి వచ్చారా అని అడగటం తో వెంటనే వెటకారంగా సమాధానమిస్తాడు. ఇక వసు మెసేజ్ డిలీట్ చేశారు ఏమిటి అని అడగటంతో రిషి మాత్రం క్యాబ్ బుక్ చేసా ఇంటికి వెళ్ళు మనుషులను, మనసులను బాధ పెట్టే రకం కాదు అని అంటాడు. అప్పుడే వసు క్యాబ్ లో వెళ్లిపోతుంది.

అదంతా గమనించిన సాక్షి.. వీరు మళ్ళీ కలుసుకుంటన్నారా అని వారిని ఎలా అయినా విడగొట్టాలి అని అనుకుంటుంది. మరొకవైపు మహేంద్ర దంపతులు రిషి దగ్గరికి వచ్చి ఒక ప్రాజెక్టు కోసం వచ్చి దాని గురించి వివరిస్తూ ఉంటారు. ఆ ప్రాజెక్టుని వసుధార తో చేయించాలి అని వసు కీ వీడియో కాల్ చేస్తారు. అప్పుడు వసు రిషి తిన్న బాక్స్ ని తింటూ ఉంటుంది. అప్పుడు జగతి ప్రాజెక్ట్ గురించి వివరిస్తూ ఉండగా వెంటనే వసు ఇప్పుడు రిషి సార్ ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అని అనడంతో పక్కనే ఉన్న రిషి ఫోన్ కట్ చేస్తాడు.

రేపటి ఎపిసోడ్ లో కాలేజీ లో ల్యాబ్ లో కెమికల్ ఫామ్ అవడంతో రిషి అందరినీ కాపాడి బయటకు రాలేక ఇబ్బంది పడి అక్కడే ఉండిపోతాడు. ఇంతలో అక్కడికి వసు రిషిని కాపాడాలి అని లోపలికి వెళ్తుంది. అప్పుడు రిషి ఇక్కడ నుంచి వెళ్ళిపో వసు ప్రాణాలకే ప్రమాదం అని అనగానే వెంటనే వసుధార మీకు ఏమైనా అయితే నేను ప్రాణాలతో ఉండలేను అంటూ తన మనసులోని మాటను బయట పెడుతుంది. ఇక రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.