Guppedantha Manasu: రిషికీ భోజనం తినిపించిన గౌతమ్..రిషి జోబులో గులాబీ పువ్వు..?

Guppedantha Manasu: తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో గౌతమ్,రిషి దగ్గరకు వచ్చి వసు తెచ్చిన కుంకుమ పెడతాడు.

ఈరోజు ఎపిసోడ్ లో గౌతమ్,రిషికి బోజనం తినిపిస్తూ ఉంటాడు. ఇంతలోనే అక్కడికి మహేంద్ర వచ్చి థాంక్స్ గౌతం అని చెప్పి అక్కడి నుంచి సంతోషంగా వెళ్లి పోతాడు. అప్పుడు గౌతమ్ రిషి కి ప్రేమగా తినిపిస్తూ ఉంటాడు. మరొకవైపు వసుధార రిషి గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది.

Advertisement

ఇక అప్పుడు గౌతమ్,రిషి ఫోన్ తీసుకుని వసుకీ వీడియో కాల్ చేస్తాడు. ఇక వసుధార అందుకు సంతోషంగా ఫీల్ అవుతుంది. రిషి వద్దు అంటున్న గౌతం వీడియో కాల్ చేసి రిషి పెట్టుకున్న బొట్టు చూపిస్తాడు.అది చూసి వసు సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటుంది.

అప్పుడు రిషి నాకు ఈ బొట్టు పెద్దమ్మ నిజంగానే పంపించిందా లేక ఇంకెవరైనా అని అడగగా అప్పుడు గౌతం ఆలోచిస్తూ ఉండడంతో రిషి ఆ కుంకుమ వసు నే పంపించింది అని గ్రహించు కుంటాడు. ఆ తర్వాత వసుధార చున్నీ చూస్తూ తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటాడు. మరొకవైపు వసు కూడా ఫోన్ లో రిషి ఫోటో చూస్తూ మిమ్మల్ని చూసే అదృష్టం నాకు లేదు అని ఫీల్ అవుతూ ఉంటుంది.

ఇక దేవయాని రిషి రూమ్ కీ రావడంతో రిషి వసు చున్నీ ని దాచి పెడతాడు. మరొకవైపు కాలేజీలో స్టూడెంట్స్ అందరూ రిషి కి వెల్కం చెప్పాలి అని ఫ్లవర్స్ తో వెయిట్ చేస్తూ ఉంటారు. అందరూ రోజ్ కలర్ గులాబీ తీసుకోగా కానీ వసు మాత్రం యెల్లో కలర్ గులాబీ తీసుకుంటుంది.

Advertisement

ఇక ఆ తరువాత స్టూడెంట్స్ లో ఒకరు ఈ ఆలోచన వసుధార ఇచ్చింది అని చెబుతారు. ఆ తర్వాత స్టూడెంట్స్ ఇచ్చిన గులాబీలు తీసుకోకుండా రిషి వెళ్తూ ఉండగా అనుకోకుండా వసు చేతిలో ఉన్న గులాబీ రిషి బ్లాజర్ సైడ్ పాకెట్ లో పడుతుంది. ఆ తరువాత రిషి తన కాబిన్ లోకి వెళ్లి పూలన్నీ టేబుల్ పై విసిరికొడతాడు.

ఇంతలో అక్కడికి మహేంద్ర వచ్చి రిషి పాకెట్ లో ఉన్నారు ఎల్లో గులాబీ పువ్వుని చూసి మనం ఏదైతే వద్దు అనుకుంటామో అది మన దగ్గరికి వస్తుంది అని చెబుతాడు. ఆ ఎల్లో కలర్ గులాబీ ని చూసిన రిషి వసుధారని తెలుసుకుంటాడు.

ఇప్పుడు ఈ గులాబీని వదులుకుంటావో లేకపోతే భద్ర పరుచుకుంటావో నీ ఇష్టం అని అనగా అప్పుడు రిషి అనుకోకుండా నా దగ్గరకు వచ్చిన ఈ గులాబీని నేను ఎందుకు వదులుకుంటాను సార్ అని అంటాడు. ఇక రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.

Advertisement

Ramesh Babu

Senior Content Editor

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
Join our WhatsApp Channel