Deepthi Sunaina : బిగ్ బాస్ ద్వారా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న దీప్తి సునయన ట్రెడిషనల్ లుక్ లో ఆకట్టుకుంటుంది. ఇక ఆమె పోస్ట్ చేసిన లేటెస్ట్ పిక్స్ సోషల్ మీడియాలో అట్రాక్షన్ గా నిలుస్తున్నాయి. యూట్యూబ్ ద్వారా తనకంటూ కొంత క్రేజ్ ని సంపాదించుకుంది. అటు డాన్సర్ గా, ఇటు షార్ట్ ఫిలిమ్స్ తీస్తూ మంచి యాక్ట్రెస్ గా యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది.
ఒక బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఈమె స్థాయి మరింతగా పెరిగింది. వేలాది మంది ప్రేక్షకులను తన వంపు సొంపులతో మూటగట్టుకుంది. ఇక ఈమె అభిమానులు బిగ్ బాస్ 2 విన్నర్ గా నిలుస్తుందని ఆశించారు. విన్నర్ కానప్పటికీ తనదైన శైలిలో ఆటలు ఆడి ఎంతగానో ప్రేక్షకులను అలరించింది. ఇక ఈమె ఇప్పుడు వెండితెర దిశగా అడుగులు వేస్తుంది. ఇక హీరోయిన్ గా ఎదగాలన్నది ఈమె కోరిక.
ఈమె పలు టీవీ షోలలో కూడా గెస్ట్ గా వ్యవహరించి ప్రేక్షకులను అలరించింది. ఇక యూట్యూబ్లో తెలుగు మ్యూజిక్ వీడియోలో నటిస్తూ తన పాపులారిటీని మరింతగా పెంచుకుంటుంది. ఇక ఈమె ఎక్కడికి వెళ్లిన ఏం పని చేసినా సోషల్ మీడియాలో ఫొటోస్ ని షేర్ చేసి అభిమానులతో పంచుకుంటుంది. ఈ విధంగా తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది.
గ్లామర్ షో లో ఏ మాత్రం తగ్గని ఈ భామ ఆకట్టుకునే ఔట్ ఫిట్ లో క్రేజీ ఫోటో షూట్ లు చేస్తూ తన అందాల కనువిందు తో నెటిజన్లను అట్రాక్ట్ చేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ పోస్ట్ చేసిన పిక్స్ నెట్టింట్లో వైరల్ అయ్యాయి. రెడ్ కలర్ లెహంగా ఓణి లో తన నడుము అందాలను చూపిస్తూ యువకుల మనసులను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది.
తన కొంటె చూపులతో తన ఫ్యాన్స్ కి అందాల కనువిందు చేస్తోంది. ఇక ఈ పిక్స్ చూసిన తన అభిమానులు ఖుషి అవుతున్నారు. రెడ్ లెహంగా లో మిర్చిల ఘాటు పుట్టిస్తున్నావు అంటూ తెగ కామెంట్లు పెడుతున్నారు. ఇక ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Read Also : Deepthi Sunaina : నెటిజన్ అంత మాటన్నాడా? దిమ్మతిరిగేలా కౌంటర్ ఇచ్చిన దీప్తి సునయన..!