Karthika Deepam Dec 29 Today Episode : కార్తీక్ ని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నా చారుశీల.. ఎమోషనల్ అవుతున్న దీప?

deepa get emotional about her health condition in todays karthika deepam serial episode
deepa get emotional about her health condition in todays karthika deepam serial episode

Karthika Deepam Dec 29 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్లో సౌందర్య ఇంద్రుడిని నిలదీస్తుంది. ఈరోజు ఎపిసోడ్ లో నీకు అంతా తెలుసు ఇంద్రుడు నువ్వు కావాలని అబద్ధాలు చెబుతున్నావు చెప్పు వాళ్ళు ఎక్కడ ఉన్నారు అని అడగగా నిజంగానే తెలియదు అమ్మ అని అబద్ధాలు చెబుతాడు ఇంద్రుడు. అప్పుడు సౌందర్య ఎంత బ్రతిమిలాడినా కూడా మీరు ఎంతలా అడిగినా నాకు తెలియదమ్మా అని అంటాడు. అప్పుడు సౌందర్య నిజం తెలిసి కూడా మాకు చెప్పడం లేదు నా ఉసురు తగులుతుంది. పాపం తగులుతుంది అని తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.

Karthika Deepam Dec 29 Today Episode
Karthika Deepam Dec 29 Today Episode

అప్పుడు ఇంద్రుడు మీరు ఎన్ని శాపానార్ధాలు పెట్టినా కూడా కార్తీక్ సార్ కి ఇచ్చిన మాటను తప్పనమ్మ అనుకుంటూ ఉంటాడు. మరొకవైపు దీప జరిగిన విషయాలు తలచుకొని బాధపడుతూ ఉండగా ఇంతలోనే అక్కడికి హేమచంద్ర వస్తాడు. అప్పుడు హేమచంద్ర బాగుందా అమ్మ మీ హెల్త్ అనడంతో బాగుంది అన్నయ్య అని అబద్ధాలు చెబుతుంది. అప్పుడు దీప ఏడవడంతో ఏమైంది దీప ఎందుకు ఏడుస్తున్నావు అని అనగా ఏమి లేదు అన్నయ్య అని కవర్ చేసుకుంటుంది. అవునులే నేను నీకు తోడబుట్టిన అన్నయ్యని కాదు కదా అని హేమచంద్ర అనడంతో దీప జరిగింది మొత్తం వివరించగా హేమచంద్ర ఒకసారిగా షాక్ అవుతాడు.

Advertisement

ఆ మాటలు విన్న పండరి కూడా ఎమోషనల్ అవుతుంది. అంటే దీపమ్మ ఎక్కువ రోజులు బ్రతకదా కార్తీక్ సార్ అబద్ధం చెప్పాడా అని అనుకుంటూ ఉంటుంది అప్పుడు దీప ఎమోషనల్ అవుతూ నేను చనిపోతున్నందుకు బాధపడలేదు అన్నయ్య నేను చనిపోయాక ఆయన ఏమైపోతారో అన్న భయం వెంటాడుతుంది అని అంటుంది. అప్పుడు హేమచంద్ర ఏం కాదు దీప నువ్వు ధైర్యంగా ఉండు అని ధైర్యం చెబుతూ ఉంటాడు. ఈ విషయం గురించి నేను కార్తీక్ తో మాట్లాడుతాను అని హేమచంద్ర అనడంతో వద్దు అన్నయ్య నాకు నిజం తెలుసు అన్న నిజం ఆయనకు తెలిస్తే బాధపడతారు అని బాధపడుతుంది దీప. అప్పుడు దీప బాధను చూసి హేమచంద్ర పండరి ఇద్దరు బాధపడుతూ ఉంటారు.

మరొకవైపు శౌర్య హేమచంద్ర ఇంటి దగ్గరికి వెళ్లి పూలు కోసుకుంటుండగా ఇంతలో రామచంద్ర ఎవరమ్మ నువ్వు అనడంతో ఎదురింట్లో కొత్తగా దిగాము అంకుల్ పూలు చాలా బాగున్నాయి కోసుకుంటాను అనడంతో సరే అని అంటాడు. అప్పుడు హేమచంద్ర ఎలా అయినా ఈ పాపను అడిగి అసలు నిజం తెలుసుకోవాలి అనుకొని మీ నాన్న ఏం పని చేస్తారు అని అడగగా మా నాన్న ఒక డాక్టర్ మా నాన్న పేరు కార్తీక్ అనడంతో హేమచంద్ర నాకు తెలిసిన కార్తీక్ ఈ పాప వాళ్ళ నాన్న ఒకటేనా అని అనుకుంటూ ఉంటాడు. మీ అమ్మ పేరు చెప్పు అనగా ఇంతలోనే అక్కడికి చంద్రమ్మ వచ్చి సౌర్యని పిలుచుకొని వెళ్తుంది. మరొకవైపు దీప బియ్యంలో రాళ్లు ఏరేస్తూ ఉండగా పండరీ వద్దు అని చెబుతుండడంతో ఇంతలోనే కార్తీక్ చారుశీల కడిగి వస్తారు.

Advertisement

ఏంటి డాక్టర్ బాబు ఈ పని కూడా చేయకూడదా అనేది నువ్వే చెప్పు చారుశీల అని అంటాడు కార్తీక్. అప్పుడు చారుశీల దీప చెయ్యి పట్టుకుని ఈ దీప ని ఎలా అయినా నా చెప్పు చేతుల్లో పెట్టుకోవాలి..ఇది చనిపోయేటప్పుడు కార్తీక్ నన్ను ఇచ్చి పెళ్లి చేయాలి అన్న ఆలోచన దీని మనసులో రావాలి అంటే దీన్ని ఇంకా నమ్మించాలి అనుకుంటూ ఉంటుంది. అప్పుడు దొంగ నాటకాలు ఆడుతూ దొంగ ప్రేమను కురిపిస్తూ దీపని నమ్మిస్తూ ఉంటుంది చారుశీల. మరోవైపు సౌందర్య జరిగిన విషయాలు తలచుకొని బాధపడుతూ ఉండగా ఇంతలో ఆనందరావు అక్కడికి వచ్చి ఆ ఇంద్రుడు నిజం చెప్పాడు సౌందర్య అనగా లేదండి అని అంటుంది.

ఇంతలోనే సౌర్య బయట నుంచి రావడంతో ఎక్కడికి వెళ్లావు అని అడగగా ఎదురింటి అంకుల్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్లాను అతను ఒక డాక్టర్ అంట పరిచయం చేసుకున్నాను అనడంతో నాకు కూడా నిన్న రాత్రి పరిచయం అయ్యాడు అని అంటాడు ఆనందరావు. మరి కార్తీక్ గురించి అడిగారా అనడంతో మన గురించి వాళ్లకు ఎందుకు చెప్పాలి అని చెప్పలేదు సౌందర్య అని అంటాడు ఆనందరావు. మరొకవైపు హాస్పిటల్లో దీపకు కార్తీక్ చారుశీల ఇద్దరు ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. అప్పుడు దీప నీకు హెల్త్ బాగోలేకపోతే నాకు ట్రీట్మెంట్ ఎందుకు చేస్తున్నారు డాక్టర్ బాబు అని అడుగుతుంది. అప్పుడు అబద్ధాలు చెప్పి కవర్ చేస్తాడు కార్తీక్.

Advertisement

Read Also : Karthika Deepam Dec 28 Today Episode : కార్తీక్, దీపను దూరం చేస్తున్న చారుశీల.. కార్తీక్ చేతిరాత గుర్తుపట్టిన హిమ, సౌందర్య?

Advertisement