వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

Karthika Deepam Dec 28 Today Episode : కార్తీక్, దీపను దూరం చేస్తున్న చారుశీల.. కార్తీక్ చేతిరాత గుర్తుపట్టిన హిమ, సౌందర్య?

Karthika Deepam Dec 28 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్లో పండరి కార్తీక్ ఇద్దరు దీపని పిలుచుకొని హాస్పిటల్ కి వెళుతూ ఉంటారు. ఈరోజు ఎపిసోడ్లో చారుశీల కి కార్తీక్ ఫోన్ చేయడంతో మాట్లాడుతూ అవునా కార్తీక్ నువ్వేం పెన్షన్ పడకు హాస్పిటల్ కి పిలుచుకొనిరా నేను అన్ని ... Read more

By Ramesh Babu

Published on: December 28, 2022 10:24 AM

Updated on: December 28, 2022 10:57 AM

deepa gets emotional about her health condition in todays karthika deepam serial episode

---Advertisement---

Karthika Deepam Dec 28 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్లో పండరి కార్తీక్ ఇద్దరు దీపని పిలుచుకొని హాస్పిటల్ కి వెళుతూ ఉంటారు.

ఈరోజు ఎపిసోడ్లో చారుశీల కి కార్తీక్ ఫోన్ చేయడంతో మాట్లాడుతూ అవునా కార్తీక్ నువ్వేం పెన్షన్ పడకు హాస్పిటల్ కి పిలుచుకొనిరా నేను అన్ని అరేంజ్ చేస్తాను అని దొంగ నాటకాలు ఆడుతూ ఉంటుంది. ఈ చారుశీల అంచనా ఎప్పుడు తప్పలేదు దీపని కొద్ది రోజుల్లోనే పైకి పంపిస్తాను అనుకుంటూ ఉంటుంది చారుశీల. ఇంతలోనే కార్తీక్ తీసుకొని హాస్పిటల్ కి రావడంతో అప్పుడు చారుశీల లోపలికి వెళ్లి దీప హెల్త్ చెక్ చేస్తూ, నేను అనుకుంటే నిన్ను ఒక్క రోజులోనే ఒక టాబ్లెట్ లేదా ఇంజక్షన్ తో పైకి పంపియచ్చు కానీ నీ మొగుడు డాక్టర్ అంత సులువుగా చేస్తే నామీద అనుమానం వస్తుంది అందుకే నిన్ను మెల్లమెల్లగా చంపేస్తాను అనుకుంటూ ఉంటుంది చారుశీల.

Karthika Deepam Dec 28 Today Episode
Karthika Deepam Dec 28 Today Episode

ఇంతలోనే కార్తీక్ అక్కడికి వచ్చి ఎలా ఉంది అని అడగగా నీకు తెలిసిందే కదా కార్తీక్ కండిషన్ చాలా బాగోలేదు త్వరగా గుండె మార్పిడి చేయాలి అని మాట్లాడుతూ ఉండగా దీప ముందు మాట్లాడకు అని అనడంతో నువ్వేం టెన్షన్ పడకు కార్తీక్ దీపం మత్తులో ఉంది అని అంటుంది చారుశీల. అప్పుడు చారుశీల దీపా చనిపోతుంది అని నిజాన్ని దాచి ఆ నింద నీ మీద వేసుకుంటే నీకు ఆ జబ్బు వస్తుందా అనడంతో నాకు వచ్చిన బాగుండేది నా ఆయుష్షు మొత్తం తనకే పోసి బతికించుకునే వాడిని అని అంటాడు కార్తీక్.

అప్పుడు కార్తీక్, దీప వైపు చూస్తూ దీప తన జీవిత కాలంలో కేవలం వేళ్ళల్లో లెక్కపెట్టినన్ని రోజులు మాత్రమే సంతోషంగా ఉంది ఇదంతా నా వల్లే అని ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు మోనిత మాటలు విని పదేళ్లు దూరం పెట్టాను అని బాధపడుతూ ఉండగా అప్పుడు మోనిత మాటలు విన్నావు ఇప్పుడు నా మాటలు వింటున్నావు నువ్వు చాలా మంచి వాడివి కార్తీక్ అనుకుంటూ ఉంటుంది చారుశీల. అప్పుడు కార్తీక్ ఏడ్చుకుంటూ దీప కండిషన్ గురించి తానే చెప్పడంతో మెలకువలో ఉన్న దీప ఆ మాటలు అన్ని వింటూ ఉంటుంది.

తర్వాత కార్తీక్ అక్కడి నుంచి వెళ్లిపోవడంతో చారిశీల పిచ్చి కార్తీక్ దీప మెలుకువలో ఉన్న విషయం మీకు తెలియదు అని అనుకుంటూ ఉంటుంది. మరొకవైపు సౌందర్య కాఫీ తాగుతూ ఉండగా ఇంతలో శౌర్య అక్కడికి కార్తీక్ రాసిచ్చిన ప్రీస్క్రిప్షన్ తీసుకొచ్చి ఇవ్వడంతో ఇది మీ నాన్న హ్యాండ్ రైటింగ్ అని సౌందర్య సంతోష పడుతూ ఉంటుంది. ఇంతలో హిమ అక్కడికి వచ్చి అది చూసి ఇది కచ్చితంగా నాన్న అదే అనడంతో కాదు చారుశీల మేడం రాసిచ్చింది అనగా వారిద్దరూ వాదించుకుంటూ ఉంటారు. సౌందర్య ఇంద్రుడిని పిలిచి ఈ ప్రిస్క్రిప్షన్ నీకు ఎవరు ఇచ్చారు ఇంద్రుడు అనడంతో చెప్పాను కదా అమ్మ చారుశీల మేడం ఇచ్చిందని అని అంటాడు.

సరే నాతో పాటు బయటికి వెళ్దాం రా అని అంటుంది సౌందర్య. మరొకవైపు దీప ని ఇంటికి పిలుచుకొని వెళ్లగా దీప కార్తీక్ వైపు అలాగే చూస్తూ బాధపడుతూ ఉంటుంది. అప్పుడు రేపటి నుంచి నేను మీకు వండి పెడతాను డాక్టర్ బాబు అనడంతో కార్తీక్ వద్దు అని సీరియస్ అయ్యి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత దీప జరిగిన విషయాలు తలుచుకుని బాధపడుతూ ఉంటుంది. మరొకవైపు సౌందర్య జరిగిన విషయాలు తలచుకొని ఈ ఇంద్రుడు నా దగ్గర ఏదో నిజం చేస్తున్నాడు అని ఆలోచిస్తూ ఉండగా ఇంతలో ఇంద్రుడు అక్కడికి వస్తాడు.

నా కొడుకుని నేను చిన్నప్పటినుండి చూస్తున్నాను అలాంటిది వాడి చేతిరాత నేను గుర్తుపట్టలేనా అనడంతో ఇంద్రుడు టెన్షన్ పడుతూ ఉండగా వెంటనే సౌందర్య కాలర్ పట్టుకుని నెల తీయడంతో అప్పుడు ఇంద్రుడు అమ్మ కాలాలు పట్టుకొని నిడదీసినంత మాత్రాన చనిపోయిన వాళ్ళు బ్రతికే ఉంటారా అని అనడంతో లేదు నా కొడుకు నా కోడలు ఇద్దరు బతికే ఉన్నారు నువ్వు అబద్దం చెబుతున్నావు అని అంటుంది సౌందర్య.

Read Also : Karthika Deepam Dec 27 Today Episode : హిమ బాధను చూసి కుమిలిపోతున్న దీప.. దీపను చంపడానికి మరొక ప్లాన్ వేసిన చారుశీల?

, , , , , ,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

Join our WhatsApp Channel