Karthika Deepam Dec 27 Today Episode : హిమ బాధను చూసి కుమిలిపోతున్న దీప.. దీపను చంపడానికి మరొక ప్లాన్ వేసిన చారుశీల?

Karthika Deepam Dec 27 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్లో హేమచంద్ర, ఆనందరావు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు..

Advertisement

ఈరోజు ఎపిసోడ్లో చారుశీల పండరి కి ఫోన్ చేయబోతుండగా ఇంతలో పండరి అక్కడికి వస్తుంది. దీపకు ఎలా ఉంది పండరి అని అడగగా మీరు ఇచ్చిన మందులు ఇచ్చిన తర్వాత పొద్దున గుండె నొప్పి వచ్చింది అప్పటినుంచి నాకు టెన్షన్ గా ఉంది అని పండరి అనడంతో మందు పనిచేయడం మొదలైంది అన్నమాట అని చారుశీల మనసులో అనుకుంటూ ఏం కాదు పండరి మొదట్లో అలాగే ఉంటుంది కానీ తర్వాత తగ్గిపోతుంది నువ్వు మాత్రం క్రమం తప్పకుండా దీపకు ఆ మందులు ఇవ్వు అని చెప్పి అక్కడి నుంచి పంపిస్తుంది.

Advertisement
Karthika Deepam Dec 27 Today Episode
Karthika Deepam Dec 27 Today Episode

మరొకవైపు సౌందర్య దంపతులు కారులో వెళుతుండగా అప్పుడు సౌందర్య ఈ ఊర్లో గుళ్ళు హాస్పిటల్ మొత్తం వెతికాను ఎక్కడ కనిపించడం లేదు అసలు ఈ ఊర్లో ఉన్నారో లేదో అనడంతో ఊర్లో ఉండి కూడా మనకు కనిపించకుండా కావాలని తప్పించుకుని తిరుగుతున్నారు ఏమో సౌందర్య అనడంతో వెంటనే సౌందర్య షాక్ అవుతుంది. ఏంటండీ అలా మాట్లాడుతున్నారు అనడంతో నిజమే సౌందర్య ఈ ఊర్లోనే ఉన్నారు అని అర్థమైంది కదా మరి మనకెందుకు కనిపించలేదు రావాలనే తప్పించుకుని తిరుగుతున్నారు కదా అని అంటాడు.

మీరు అలా మాట్లాడకండి నాకు భయంగా ఉంది అని అంటుంది సౌందర్య. అప్పుడు ఆనందరావు నాకెందుకు మన చుట్టూ ఉన్నవారు దీప వాళ్ళు ఎక్కడున్నారో తెలిసి కూడా మనకు నిజం చెప్పకుండా దాస్తున్నారేమో అనిపిస్తుంది అనగా నాకు కూడా అలాగే ఉంది అని సౌందర్య వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మరొకవైపు దీప కార్తీక్ ఇంద్రుడు ఒకచోట కలుసుకుంటారు. ఇప్పుడు దీప నన్ను క్షమించు ఇంద్రుడు నిన్ను తప్పుగా అపార్థం చేసుకున్నాను నా బిడ్డను ఇవ్వడం ఇష్టం లేక ఇలా ఊర్లు తిరుగుతున్నావు అనుకున్నాను అని అంటుంది.

Advertisement

మా బిడ్డను చాలా బాగా జాగ్రత్తగా చూసుకుంటున్నావు మీ రుణం ఎలా తీర్చుకోవాలో అని అనగా అలాంటి మాటలు మాట్లాడకండి అమ్మ అని అంటాడు. అప్పుడు వాళ్లు మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో ఇంద్రుడు సౌర్యమ్మ ప్రస్తుతం వల్ల తాతయ్య నానమ్మ దగ్గర ఉంది అనడంతో దీప, కార్తీక్ షాక్ అవుతారు. అంతేకాదు సార్ మీ అమ్మానాన్న అలాగే మీ పాప హిమ కూడా ఇక్కడికే వచ్చేసారు అనడంతో దీప కార్తీక్ ఇద్దరు సంతోషపడుతూ ఉంటారు. అప్పుడు దీప డాక్టర్ బాబు నా కూతురు హిమ ని చూడాలి చాలా రోజులు అయింది అత్తయ్య మామయ్యని చూడాలి అని అనగా నువ్వు తొందర పడకు దీప అని అంటాడు కార్తీక్.

అప్పుడు దీప నా కూతురు సౌర్యని ఎలా అయితే చూపించావో వాళ్లను కూడా అలాగే చూపించి ఇంద్రుడు అని అనడంతో సరే అని అంటాడు. ఇంతలోనే హిమ అటుగా నడుచుకుంటూ ఇలా అయినా సౌర్యతో మాట్లాడాలి అమ్మ నాన్నలను వెతకాలి వాళ్లు ఎక్కడ ఉన్నారు అని ఆలోచించుకుంటూ వస్తూ ఉంటుంది. అప్పుడు హిమ ని చూసిన ఇంద్రుడు సార్ మీ హిమ ఇటుగా వస్తుంది మీరు కనిపించకుండా వెళ్లిపోండి అనడంతో అప్పుడు దీప కార్తీక్ హిమను చూసి ఎమోషనల్ అవుతారు. అప్పుడు అక్కడి నుంచి తప్పించుకుని వెళ్తుండగా హిమ వాళ్ళను చూసి డాడీ మమ్మీ అంటూ వాళ్ళ వెంటపడుతుంది.

Advertisement

అప్పుడు కార్తీక్ వాళ్ళు తప్పించుకుని వెళ్లిపోవడంతో డాడీ మమ్మీ అంటూ పులి ఎమోషనల్ అవుతుంది హిమ. అప్పుడు హిమ వెనక చెట్టు చాటున దాక్కొని హిమ బాధను చూసి దీప గుండెలు పగిలేలా బాధపడుతూ ఉంటుంది. కన్న కూతురు తల్లిదండ్రుల కోసం కళ్ళముందే ఇంతలా ఆరాటపడుతున్న ఏమి చేయలేని పరిస్థితి నాది ఎందుకు నాకు ఈ జీవితం దేవుడా అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది దీప. మరొకవైపు చారుశీల పండరి కి ఫోన్ చేసి దీప వాళ్ళు ఉన్నారా అనగా లేరమ్మ బయటికి వెళ్లారు అనడంతో ఈపాటికి దీపకు గుండెపోటు రావాలి కదా నా అంచనా తప్పింది. డోస్ పెంచి దీప ని తొందరగా పైకి పంపించాలి అని మరో ప్లాన్ వేస్తుంది పండరి.

ఆ తర్వాత హిమ ఇంటికి వెళ్లి సౌందర్య వాళ్ళని పిలిచి అమ్మానాన్నలు కనిపించారు అనడంతో సౌందర్య ఆనంద్ రావు ఇద్దరు ఆనంద పడుతూ ఉంటారు. ఇప్పుడు శౌర్య మాత్రం నమ్మకుండా జోకు వేస్తున్నావా హిమ అని అంటుంది. లేదు సౌర్య నేను చెప్పేది నిజం అనడంతో మరి ఎక్కడికి వెళ్లారు అనగా కనిపించకుండా వెళ్ళిపోయారు అనడంతో అప్పుడు సౌందర్య అది చెప్పేది నమ్మొచ్చు కదా అనడంతో లేదు నానమ్మ నేను తనతో మాట్లాడాలని ఇలా నాటకాలు ఆడుతోంది అని హిమను తప్పుగా అర్థం చేసుకుంటుంది శౌర్య. అప్పుడు సౌర్య చూడు హిమ అమ్మ వాళ్ళు తిరిగి వచ్చిన నువ్వే తీసుకుని వచ్చినా కూడా నేను నీతో ఎప్పటికీ మాట్లాడను అని అంటుంది. మరొకవైపు దీపకు గుండెపోటు రావడంతో కార్తీక్ పండరీ ఇద్దరు కలిసి హాస్పిటల్కి తీసుకొని వెళ్తూ ఉంటారు..

Advertisement

Read Also : Karthika Deepam Dec 26 Today Episode : సౌర్యను చూసిన దీప.. దీపను మళ్లీ మోసం చేస్తున్న కార్తీక్?

Advertisement