Karthika Deepam serial Oct 15 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో దుర్గ, మోనిత ని అడ్డంగా ఇరికిస్తాడు. ఈరోజు ఎపిసోడ్ లో దుర్గ నిన్న రాత్రి హ్యాండ్ బాగ్ మర్చిపోయావు కదా మోనిత అని దుర్గా అనగా వెంటనే మోనిత నేను నీ దగ్గర హ్యాండ్ బ్యాగ్ మర్చిపోవడం ఏంట్రా అని అనడంతో అదేటి మోనిత అలా మాట్లాడుతున్నావ్ నిన్న మనిద్దరం కలిసి కార్తీక్ బాబుని వెతకడానికి వెళ్ళాం కదా అప్పుడు నా దగ్గర మర్చిపోయావు అని అంటాడు. దాంతో మోనిత ఒక్కసారిగా షాక్ అవుతుంది. కోపంతో రగిలిపోతున్న కార్తీక్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు.

ఆ తర్వాత దుర్గా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండగా మోనిత వెళ్లి నన్ను అడ్డంగా ఇరికించావు కదా నీ సంగతి చూస్తాను అంటూ దుర్గకు వార్నింగ్ ఇస్తుంది. ఆ తర్వాత కార్తీక్ ఉంటదిగా కూర్చుని దీప సౌర్యుల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. మోనిత దగ్గరికి ఎలా వచ్చాను పిల్లలు ఎక్కడ ఉన్నారు అంటే పిల్లలు ఇక్కడ ఉన్న విషయం దీపకు తెలియదా అని ఆలోచిస్తూ ఉంటాడు. సౌర్య బొమ్మలు ఎందుకు అమ్ముతోంది అని ఆలోచిస్తూ ఉంటాడు కార్తీక్.
ఆ తర్వాత దీప వాళ్ళ అన్నయ్య దుర్గకి భోజనం వడ్డిస్తూ ఉంటుంది. అప్పుడు వాళ్ళు నువ్వు కూడా తినమ్మా అని అనగా నేను డాక్టర్ బాబు తిన్న తర్వాత తింటాను అని అంటుంది దీప. అలా వారు కార్తీక్ గురించి కొద్దిసేపు మాట్లాడుకుంటూ ఉంటారు. మరొకవైపు శివ స్విమ్మింగ్ పూల్ క్లీన్ చేస్తూ ఉండగా ఇంతలో అక్కడికి కార్తీక్ వస్తాడు. అప్పుడు కార్తీక్ కావాలనే శివ అని పేరు పెట్టి పిలవకుండా వేరే పేరుతో పిలుస్తాడు.
Karthika Deepam అక్టోబర్ 15 ఎపిసోడ్ : శివకు సౌర్యని వెతకమని చెప్పిన కార్తీక్..
ఆ తర్వాత కార్తీక్ మనం ఆరోజు బొమ్మలు కొన్నాం కదా. ఆ అమ్మాయి గుర్తుందా అని అడగగా గుర్తుంది సార్ నిన్ననే కనిపించింది మిమ్మల్ని అడిగింది థాంక్స్ చెబుదామనుకుంది కానీ మేడం ఏదో పని చెప్పి నన్ను అక్కడ నుంచి పంపించింది అనటంతో వెంటనే కార్తీక్ అంటే సౌర్య ఇక్కడే ఉందన్నమాట అని అనుకుంటాడు. శౌర్య ఇక్కడ ఉండడం మోనితకు నచ్చడం లేదు నన్ను ఎక్కడ సౌర్య గుర్తు పడుతుందో అని నాకు సౌర్యని దూరం పెడుతుంది.
ఎలాగైనా నాకు కనబడు రౌడీ ఇద్దరూ కలిసి మీ అమ్మని ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోదాము అని కార్తీక్ అనుకుంటాడు. అప్పుడు శివ ఏమైంది అని అడగగా ఏం లేదు ఆ పాప ఎక్కడ ఉందో అడ్రస్ తెలుసుకో కానీ ఈ విషయం మీ మేడం చెప్పొద్దు ఆ పాపను వెతికే పనిలో ఉండు అని చెబుతాడు కార్తీక్. మరొకవైపు ఇంద్రుడు సౌర్య కనిపించకపోయేసరికి టెన్షన్ పడుతూ ఉంటాడు.
ఇంతలోనే సౌర్య రావడంతో ఎక్కడికి వెళ్లావు బంగారు అని అడగగా అమ్మానాన్నల కోసం వెళ్లాను బాబాయ్ కానీ కనిపించలేదు అంటూ బాధపడుతూ ఉంటుంది సౌర్య. మరొకవైపు కార్తీక్,మోనిత అంటూ గట్టిగా పిలుస్తాడు. అప్పుడు ఏంటి కార్తీక్ అని అడగక నువ్వు దీపను చంపడానికి ఎందుకు రౌడీలను పంపావు అని అడగగా ఇంతలోనే అక్కడికి వచ్చిన దీప వారి మాటలు వింటూ ఉంటుంది.
అప్పుడు లేదు కార్తీక్ నేను పంపించలేదు అని అనటంతో అబద్ధం చెప్పకు మోనిత నువ్వు దీపని చంపడానికి మనుషులను పంపావు. వారిని నేనే కొట్టాను. అప్పుడే నాకు ఈ దెబ్బ తగిలింది అనడంతో మోనిత, దీప ఇద్దరు షాక్ అవుతారు. నేను పంపలేదు కార్తీక్ అనడంతో అంటే దీప ని కాకుండా నన్ను చంపడానికి పంపావా అని అడుగుతాడు.
అప్పుడు ఏం మాట్లాడుతున్నావ్ కార్తీక్ అని అనగా కార్తీక్,మరి ఈ దెబ్బ ఏంటి?వాళ్ళు దీప వెనక వెళ్తే నేను వెళ్లి వారిని కొట్టి వచ్చాను ఇదే నిజం వాళ్ళని కూడా నువ్వు పంపించావు అన్నదే నిజం అని చెప్పి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కార్తీక్. ఇదంతా చూస్తున్న దీప కోపంగా అక్కడ నుంచి బయటకు వచ్చేస్తుంది. అప్పుడే దీప కి దుర్గ కనిపిస్తాడు.
ఇప్పుడు దీప అసలు విషయం చెప్పడంతో దుర్గ,మోనిత దగ్గరికి వెళ్తాడు. అప్పుడు హాయ్ బంగారం అని మాట్లాడిస్తూ మోనిత నేను పిచ్చ కోపంలో ఉన్నాను ఇక్కడ నుంచి వెళ్ళిపో అంటూ దుర్గా మీద సీరియస్ అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో భాగంగా కార్తీక్ దీప దగ్గరికి వెళ్లి తలనొప్పిగా ఉంది కాఫీ ఇస్తావా అని అడగగా సరే అని లోపలికి పిలుచుకుని కాఫీ ఇస్తుంది దీప.
ఇంతలో అక్కడికి మోనిత వచ్చి వంటలక్క అని గట్టిగా అరుస్తుంది. అప్పుడు మోనిత నీకు ఎంత ధైర్యం నా మొగుడిని పిలుచుకొని వస్తావా అని అనగానే వెంటనే దీప, మోనిత చెంప చెల్లుమనిపిస్తుంది. అప్పుడు కార్తీక్ కూడా చూసి ఏమనక పోవడంతో ఏంటి కార్తీక్ అలాగే చూస్తున్నావు ఈ భార్యని కొడుతుంటే అలాగే సినిమా చూసినట్టు చూస్తావా అని అనడంతో వెంటనే కార్తీక్ భార్యనా నువ్వు నా లేక వంటలక్క నా భార్య అనటంతో మోనిత షాక్ అవుతుంది.