Viral video: చాలా మందికి దూరం నుంచి పామును చూస్తేనే.. విపరీతమైన భయం కల్గుతుంది. మరికొంత మందిగి జుగుత్సగా అనిపిస్తుంది. అదే మనం తినే ఆహారంలో పాము కనిపిస్తే ఎలా ఉంటుంది.. చీచీ ఇలా ఊహించుకోవడానికే దారుణంగా ఉంది అనిపిస్తోంది కదా.. అలాగే ఉంటుంది. చైనాలో పాములు తినే వాళ్లకు ఏమో కానీ మన లాంటి వాళ్లకు మాత్రం పామును చూస్తేనే ఒళ్ల జలదరిస్తుంది. అంది కూడా తినే అన్నంలో కనిపిస్తే ఇక అంతే పరిస్థితులు. అయితే ఇలాంటి ఘటనే ఓ విమానంలో చోటు చేసుకుంది. విమానంలో ఓ అటెండెంట్ భోజనం చేస్తుండగా అందులో పాము తల కనిపించింది. అంతే ఒక్కసారిగా హడలి పోయి గట్టిగా కేకలు వేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారింది.
జులై 21న టర్కీలోని అంకారా నుంచి జర్మనీలోని డ్యూసెట్ డార్ఫ్ కు వెళ్తున్న సన్ ఎక్స్ ప్రెస్ విమానంలో ఈ దిగ్భ్రాంతికర సంఘటన చోటు చేసుకుంది. క్యాబిన్ సిబ్బంది భోజనం చేస్తున్నారు. అందులో ఒక అటెండెంట్ సగం భోజనం పూర్తయిన తర్వాత బంగాళ దుంపలు, కూరగాయల మధ్య తెగిపడిన పాము తలను గుర్తించాడు. అంతే భయంతో కెవ్వుమని కేస వేసి వణికిపోయాడు. ట్విట్టర్ లో షేర్ చేసిన ఈ వీడియోలో పుడ్ ట్రే మధ్య పాము తల స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఘటనపై విమానయాన సంస్థ స్పందించింది. ఈ ఘటనపై వెంటనే చర్యలు చేపట్టింది. మరసారి ఇలాంటివి పునరావృతం కాకుండా చేస్తామని తెలిపింది.