వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

Bigg Boss season 6 telugu : శ్రీసత్య టచ్ కోసం కక్కుర్తి కల్యాణ్ ఆత్రం..

Bigg Boss season 6 telugu : బిగ్ బాస్ షో గాడిలో పడింది. ఆట మంచి రసవత్తరంగా సాగుతోంది. నాలుగో వారం కెప్టెన్సీ టాస్క్ మంచి ఎంటర్ టైన్మెంట్ ఇచ్చింది. ఈ టాస్కులో కీర్తి, శ్రీసత్య, సుదీప ముగ్గురూ కెప్టెన్సీ కోసం పోటీ పడ్డారు. నంబర్ గేమ్ లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి ఆఖరి వరకు పోటీ పడ్డ కీర్తి.. నాలుగో కెప్టెన్ గా నిలిచింది. మరోవైపు మన ఓవరాక్షన్ స్టార్ శ్రీహాన్ ఎప్పట్లాగే పొద్దుపొద్దున్నే ... Read more

By Vinod Kumar

Published on: October 1, 2022 10:30 AM

Updated on: October 2, 2022 10:05 AM

bigg boss season 6 september 30 written updates hot topic on arjun kalyan and sri satya romance..

---Advertisement---

Bigg Boss season 6 telugu : బిగ్ బాస్ షో గాడిలో పడింది. ఆట మంచి రసవత్తరంగా సాగుతోంది. నాలుగో వారం కెప్టెన్సీ టాస్క్ మంచి ఎంటర్ టైన్మెంట్ ఇచ్చింది. ఈ టాస్కులో కీర్తి, శ్రీసత్య, సుదీప ముగ్గురూ కెప్టెన్సీ కోసం పోటీ పడ్డారు. నంబర్ గేమ్ లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి ఆఖరి వరకు పోటీ పడ్డ కీర్తి.. నాలుగో కెప్టెన్ గా నిలిచింది. మరోవైపు మన ఓవరాక్షన్ స్టార్ శ్రీహాన్ ఎప్పట్లాగే పొద్దుపొద్దున్నే తన పర్ఫార్మెన్స్ చూపించడం మొదలు పెట్టాడు. ఆ సమయంలో మరే కంటెస్టెంట్ మంచి ఫుటేజీ ఇవ్వకపోవడంతో బిగ్ బాస్ కెమెరాలన్నీ తన వైపే పెట్టి తన ఓవరాక్షన్ అంతా చూపించాడు. తన ఫోటో దగ్గరకు పోయి.. ఇంట్లో వాళ్లు నిన్ను కొట్టాలని చూస్తున్నారని, అలర్ట్ గా ఉండాలని తనకు తానే చెప్పుకున్నాడు. తన మిగతా వారి ఫోటోల ముందుకు వెళ్లి వారిని ఇమిటేట్ చేసేందుకు ప్రయత్నించాడు.

bigg boss season 6 september 30 written updates hot topic on arjun kalyan and sri satya romance..
bigg boss season 6 september 30 written updates hot topic on arjun kalyan and sri satya romance..

శ్రీసత్య గురించి అర్జున్ కల్యాణ్ కక్కుర్తి వ్యవహారాలపై రోహిత్, మెరీన్, కీర్తి, ఆరోహిల మధ్య తెగ చర్చ నడిచింది. అర్జున్ కల్యాణ్ శ్రీ సత్య కోసం పడిచస్తున్నాడని.. తన దగ్గర ఉన్నదంతా ఆమెకు ఇచ్చేస్తున్నాడని వారు గుసగుసలాడారు. శ్రీసత్యని టచ్ చేయనిస్తే.. ముద్దు ఇస్తే డబ్బులిస్తానని అర్జున్ అన్నాడట.. ఆమె దానికి ఒప్పుకుందట.. అందుకే తన వద్ద ఉన్న మొత్తం డబ్బులను శ్రీసత్యకు ఇచ్చాడట అని చెవులు కొరుక్కున్నారు.

Read Also : Bigg Boss 6 Telugu : చెత్త ఆటగాడు అర్జున్ కళ్యాణే.. తేల్చేసిన బిగ్ బాస్ ఇంటి సభ్యులు

, , , , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

Join our WhatsApp Channel