Swetha Varma : టాలీవుడ్‌లో కాస్టింగ్ కౌచ్ వివాదం సంచలనానికి దారితీసింది. చాలామంది హీరోయిన్లు, సినిమాల్లో నటించేందుకు ప్రయత్నించిన వారు ఎందరో ఈ కాస్టింగ్ కౌచ్ వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నవారే ఉన్నారు. కొంతమంది తమకు ఎదురైన ఇబ్బందులను బయటపెట్టలేదు.. మరికొంతమంది ధైర్యంగా తమకు ఎదురైన ఈ కాస్టింగ్ కౌచ్ వ్యవహారాన్ని కుండబద్దలు కొట్టినట్టుగా బయటకు చెప్పేశారు. అందులో బిగ్ బాస్ 5 తెలుగు సీజన్ లో ఎంట్రీ ఇచ్చిన శ్వేత వర్మ.. కూడా తనకు ఇలాంటి అనుభవమే ఎదురైందని చెప్పుకొచ్చింది. ఓ ఇంటర్వ్యూలో తాను ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొందో చెప్పింది.
బిగ్‌బాస్ సీజన్ 5లో తనదైన శైలిలో ఆడుతూ బిగ్ బాస్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది శ్వేత వర్మ. చాలా సైలంట్‌గా ఉంటూనే అవసరమైనప్పుడు టాస్కులు ఆడుతూ బాగానే పాపులర్ అయింది ఈ భామ.. అయితే ఎక్కువ రోజుల పాటు హౌస్‌లో ఉండలేదు. బిగ్ బాస్ లో అవకాశం వచ్చిన తర్వాత ఈ అమ్మడికి అనేక సినిమా అవకాశాలు కూడా వచ్చాయి. చాలావరకూ సినిమాల్లో శ్వేతవర్మ నటించింది కూడా. అయితే ఆ సినిమాల్లో ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టలేకపోయాయి.
Swetha Varma : దర్శకుడు కమిట్మెంట్ అడిగాడంటూ షాకింగ్ కామెంట్స్..
సినిమా ఇండస్ట్రీలో ఎప్పటినుంచో కమిట్మెంట్ అనేది ఎక్కువగా వినిపిస్తోంది. కాస్టింగ్ కౌచ్ కారణంగా ఇబ్బంది పడిన చాలా మంది బాధితులు ఈ విషయాన్ని బహిరంగంగానే చెప్పేశారు. ఎంతోమంది తమకు ఫిర్యాదులు కూడా చేశారు. అలాగే శ్వేత వర్మ కూడా ఓ ఇంటర్వ్యూ సందర్భంగా తనకు ఎదురైన అనుభవాలను బయటపెట్టింది. ఒక షార్ట్ ఫీలిం చేస్తున్న సమయంలో తనకు కమిట్మెంట్ అనేది ఎదురైందని తెలిపింది.
ఆ షార్ట్ ఫిల్మ్‌లో నటిస్తన్న సమయంలో ఆ డైరెక్టర్ తనను కలిసినట్టు తెలిపింది. ఆ సమయంలో దర్శకుడు తనను కమిట్మెంట్ అడిగినట్టు శ్వేతవర్మ బయటపెట్టింది. అప్పట్లో తనకు కమిట్మెంట్ అనే పదానికి అర్థం తెలియదని చెప్పుకొచ్చింది. ఏంటి అని అడిగితే.. ఆ డైరెక్టర్ తనకు రెండు లక్షలు ఇస్తాను.. నాతో వస్తావా అని అడిగాడని షాకింగ్ నిజాలను రివీల్ చేసింది శ్వేత వర్మ.
ఆ మాటలకు ఆ డైరెక్టర్‌ను అక్కడే పట్టుకుని చెప్పుతో కొట్టాలన్నంత కోపం వచ్చిందని తెలిపింది. ఏమాత్రం భయపడకుండా.. ధైర్యంగా శ్వేతవర్మ అతడికి దిమ్మతిరిగేలా సమాధానం చెప్పిందట.. అంతకంటే ముందు నువ్వు ఒక పని చేయమని అడిగిందట.. పక్కనే బిల్డింగ్‌పైనుంచి దూకేయండి అంటూ పీడా పోతుందని శ్వేత వర్మ తనదైన శైలిలో కడిగిపారేసింది. శ్వేత వర్మ బిగ్ బాస్ లోకి రావడానికి ముందు.. ఆమె మిఠాయి, ది రోజ్ విల్లా, ముగ్గురు మొనగాళ్లు వంటి మూవీల్లో నటించింది.
Read Also : Anchor Vishnu Priya : ఫేస్‌బుక్‌లో విష్ణుప్రియ అశ్లీల ఫొటోలు.. యాంకర్ ఏం చేసిందో తెలిస్తే షాకవ్వాల్సిందే..!