Custard apple: సీతాఫలం ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. శీతాకాలంలో లభించే ఈ రుచికరమైన పండును చాలా మంది ఇష్టంగా తింటారు. ఇది సాధారణంగా కొండ ప్రాంతాల్లో ఎక్కువగా లభిస్తుంది. దేశంలోని అన్ని మార్కెట్లలో ఆగస్టు నుంచి నవంబర్ వరకు ఈ పండు సులువుగా దొరుకుతుందని. మామిడి పండ్లు, యాపిల్స్ లాగా అందరూ సీతాఫలాలలను చాలా ఇష్టంగా తింటారు.
సీతాఫలాన్ని మితంగా తినడం వల్ల అధిక రక్తపోటు నుంచి జీర్ణక్రియ వరకు అనేక ఆరోగ్య సమస్యలను అధిగమించవచ్చు. కానీ ఈ పండును క్రమంగా కాకుండా.. అధికంగా తీసుకుంటే అది మెదడు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. పార్కిన్సన్స్ వంటి వ్యాధిని కూడా ప్రేరేపిస్తుంది. అయితే ఇది అధిక పరిమాణంలో వినియోగించినప్పుడు మాత్రమే జరుగుతంది. పరిమిత పరిమాణంలో తీసుకోవడం ద్వారా మీరు అనేక ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు తెలుపుతున్నారు.
మానసిక స్థితి మెరుగుపడుతుంది. అక్టోబర్ రాగానే చాలా మందిలో మూడు సమస్య పెరుగుతుంది. శీతాఫలం ప్రారంభంలో పలు అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి. ముఖ్యంగా కరోనా ఇన్సెక్షన్ తర్వాత పెద్ద సంఖ్యలో ప్రజలు మానసిక ఆరోగ్య సమస్యలు మూడ్ స్వింగ్స్ వంటి సమస్యలతో బాధపడుతున్నారు.