Unstoppable NBK season2 : అలరిస్తున్న అన్ స్టాపబుల్ ప్రోమో, బాబుతో మామూలుగా ఉండదు మరి!

Balakrishna unstoppable Season 2 promo released
Balakrishna unstoppable Season 2 promo released

Unstoppable NBK season2 : నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న బాలయ్య అన్ స్టాపబుల్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే హీరోగా, పొలిటీషియన్ గానే కాకుండా హోస్ట్ గా కూడా తనదైన ముద్ర వేసిన బాలయ్య బాబు.. రెండో సీజన్ తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తనదైన మాటలు, పంచులతో వచ్చిన అతిథులను తికమకపెడుతూ ఎంతో హాయిగా, సరదాగా సాగించిన అన్ స్టాపబుల్ సీజన్ 1 ను.. సీజన్ 2 మించిపోయేలా ప్లాన్ చేశారు. ఈ క్రమంలోనే మొదటి ఎపిసోడ్ లో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబును గెస్టుగా తీసుకొచ్చారు.

Balakrishna unstoppable Season 2 promo released
Balakrishna unstoppable Season 2 promo released

ఇందుకు సంబంధించిన ప్రోమోను కూడా రిలీజ్ చేశారు నిర్వాహకులు. అయితే చంద్రబాబు నాయుడు బాలయ్య బాబుకు బావ అన్న విషయం అందరికీ తెలిసిందే. అలాగే వియ్యంకులు కూడా. ఈ బావా, బామ్మర్దులు టాక్ షోలో చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఇక ప్రోమోలో బాలయ్య మీ బెస్ట్ ఫ్రెండ్ గురించి చెప్పండని చంద్రబాబును అడగ్గా.. నేను రాజశేఖర్ రెడ్డి కలిసి బాగా తిరిగామని చంద్రబాబు చెప్పారు. అలాగే ఈషోకు నారా లోకేష్ కూడా హాజరయ్యారు. మా చెల్లికి ఐ లవ్ యూ చెప్పండి బావా అని బాలకృష్ణ అడగ్గా… చంద్రబాబు ఆయన భార్యకు ఫోన్ చేసి… నేను బాలకృష్ణ చేతిలో ఇరుక్కుపోయానని చెప్పడం నవ్వులు పూయించింది.

Advertisement

https://youtu.be/jGMH_luXetg

Read Also : Viral video: పామును ఒంటి చేతితో పాము తలను పట్టుకున్న బాలుడు, ఏమైందంటే ?

Advertisement