Baladithya captain : బిగ్ బాస్ హౌస్ లో ఫస్ట్ వీక్ చాలా బాగా సాగుతోంది. ఓ వైపు గొడవలు మరోవైపు రచ్చతో ట్రోల్స్ కు గురవుతున్నారు. వారి పేర్లు, ముఖాలు గుర్తుపెట్టుకోవడం మొదటి వారంలో కొంచెం కష్టమే అయినప్పటికీ.. అంతా కెమెరాల్లో పడడానికి గట్టిగానే కష్టపడుతున్నారు. గొడవ చేసైనా సరే ప్రలకు తెలియలనుకుంటున్నారు. ఇక తొలి వారానికి సంబంధించిన నామినేషన్స్ కంప్లీట్ కాగా.. ఏడుగురు నామినేట్ అయ్యారు.
ఇక తొలి వారానికి సంబంధించిన నామినేషన్లు కంప్లీట్ కాగా హౌస్ లో అందరితో బాగుండి కాప్టెన్ గా సెలెక్ట్ అయ్యాడు బాలాదిత్య. బిగ్ బాస్ సీజన్ 6కి సంబంధించి ఓ వైపు లైవ్ ఇస్తూ… రాత్రికి అదే ఫుటేజీని టెలికాస్ట్ చేస్తున్నారు. అయితే అన్ సీన్ ఎపిసోడ్ లో ఈ కెప్టెన్సీ టాస్క్ ముగియడమే కాదు.. జైలు పంచాయతీలు కూడా ముగిశాయి.
కెప్టెన్ పోటీ దారులుగా ఉన్న కంటెస్టెంట్స్ కి కెప్టెన్సీ బండి అనే టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ కు ఫైమాని సంచాలక్ గా నియమించారు. ఆదిరెడ్డి, బాలాదిత్య, రేవంత్, ఆరోహి, చాందిని చౌదరి, ఆర్జే సూర్య, మెరీనా, గీతుస రోహిత్ లు కెప్టెన్ పోరులో నిలిచారు. ఆదిరెడ్డి, బాలాదిత్య మధ్య టఫ్ ఫైట్ నడిచింది. చివరకి బాలాదిత్య బిగ్ బాస్ సీజన్ 6కి ఫస్ట్ కెప్టెన్ అయ్యాడు.
Read Also : Bigg boss Season 6 : బిగ్ బాస్ లో మొగుడు, పెళ్లాల గలీజ్ పంచాయతీ.. మధ్యలోకి వచ్చిన శ్రీసత్య!