...

Viral Video: బ్యాక్ బెంచ్ స్టూడెంట్ సివిల్ ఇంజనీర్ అయితే కథ ఇట్లుంటది మరి… నవ్వులు తెప్పిస్తున్న ఫన్నీ వీడియో!

Viral Video: సాధారణంగా తరగతి గదిలో ముందు కూర్చున్న వాళ్ళంతా ఇంటలిజెంట్ స్టూడెంట్ అని బ్యాక్ బెంచ్ లో కూర్చున్నా వాళ్ళందరూ చదువుపై శ్రద్ధ లేని వారిని ప్రతి ఒక్కరు భావిస్తుంటారు.అయితే ఇది పూర్తిగా అవాస్తవం బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ కూడా ఎంతో ఉన్నతమైన స్థానాల్లో ఉన్నారు. అయితే కొన్నిసార్లు సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి.అలాంటి వాటిని చూసినప్పుడు నిజంగానే బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ గుర్తుకొస్తారు. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ వీడియో చూస్తే మాత్రం నవ్వకుండా ఎవరూ ఉండలేరు. ఇంతకీ ఏముందనే విషయానికి వస్తే.. ఇంటి నిర్మాణం జరుగుతూ ఉండగా అక్కడ కాంక్రీట్ మిషన్ కాంక్రీట్ కలుపుతోంది. వెంటనే అక్కడికి కళ్ళజోడు పెట్టుకొని ఒక వ్యక్తి అక్కడికి వచ్చి కాంక్రీట్ మిక్సర్ కాస్త తీసుకొని రుచి చూశాడు.అదేదో ఆయన పెద్ద వంట చేస్తూ వంటలో ఉప్పు కారం సరిగ్గా సరిపోయా లేదా రీతిలో టేస్ట్ చేసి అందులోకి కాస్త ఇసుక వేసి వెళ్ళాడు.

 

View this post on Instagram

 

A post shared by memes😜 (@memes__dhamaka)


ఇక్కడ ఆయన టేస్టు చూసి ఇసుక వేయడం అందరికీ హాస్యం తెప్పిస్తోంది. ఈ క్రమంలోనే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఇలాంటి ఇంజనీర్లు కూడా ఉంటారా అని కొందరు కామెంట్లు చేయగా మరికొందరు బ్యాక్ బెంచ్ స్టూడెంట్ సివిల్ ఇంజనీర్ అయితే కథ ఉంటది మరీ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక ఈ ఫన్నీ వీడియోని ధమాకా అనే ID పేరుతో షేర్ చేశారు. ఈ వీడియో షేర్ చేసిన అతి తక్కువ సమయంలోనే 10 మిలియన్లకు పైగా అంటే 1 కోటి సార్లు వీక్షించారు. 5 లక్షల మంది లైక్ చేశారు. మరికెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియో పై ఓ లుక్కేయండి.