Baba Bhasker: సినిమాలే తన జీవితం అంటూ ఎమోషనల్ కామెంట్లు చేశారు కొరియోగ్రాఫర్ బాబా భాస్కర్. యాక్టర్, ్యాన్సర్, కొరియోగ్రాఫర్ ఇలా దేంట్లో అయినా సరే సినీ రంగంలో ఉంటే తన కోరిక తీరినట్లేనని చెబుతున్నారు. అయితే యంగ్ హీరో కిరణ్ అబ్బవరం హీరోగా సంజనా ఆనంద్, సిద్దార్థ్ మీనా హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం నేను మీకు బాగా కావాల్సిన వాడిని. అయితే శ్రీధర్ గాదె దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కోడి దివ్య ఎంటర్ టైన్ మెంట్స్ కోడి రామకృష్ణ గారి ప్రథమ కుమార్తె కోడి దివ్య దీప్తి నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా సెప్టెంబర్ 16వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ సినిమాలో కీలక పాత్రలో నటించిన బాబా భాస్కర్ అందుకు సంబంధించిన పలు విషయాలను మీడియాతో పంచుకున్నారు.
ఈ చిత్రంలో నటించడం తనకు చాలా సంతోషాన్ని ఇచ్చిందని తెలిపారు బాబా భాస్కర్. కిరణ్ అబ్బవరంతో పని చేయడం చాలా సులువుగా ఉందని.. ఆయన అందరినీ కలుపుకొని వెళ్లడమే అందుకు ప్రధాన కారణం అని తెలిపారు. నేను ఒక సినిమా డైరెక్ట్ చేశారనని… ఆ తర్వాత కూడా డైరెక్షన్ చేయాలని చాలా కథలు సెలెక్ట్ చేసుకుంటున్నాని చెప్పుకొచ్చారు.