Astro Tips : సాధారణంగా మానవ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురవుతూ ఉంటాయి. కొన్నిసార్లు గ్రహాల అనుకూల స్థితిలో లేకపోవడం వల్ల సమస్యలు వెంటాడటమే కాకుండా దురదృష్టం వెంటాడుతూ ఉంటుంది. ఈ సమయంలో మనం ఎలాంటి పనులు చేసిన పెద్దగా కలిసి రాకపోవడమే కాకుండా మానసిక ఇబ్బందులు కూడ తలెత్తుతూ ఉంటాయి. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ఈ చిన్న పరిహారాలను చేయటం వల్ల వారికి అదృష్టం కలిసి వస్తుంది.

Astro Tips
మీరు ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ ఉంటే కొబ్బరికాయ తలపై భాగంలో పచ్చ కర్పూరం వెలిగించి దిష్టి తీయాలి. ఈ విధంగా 21 సార్లు దిష్టి తీసిన తర్వాత కొబ్బరికాయను పారుతున్న నీటిలో వేయాలి. అయితే కుటుంబ సభ్యులలో ఒక్కొక్కరికి ఒక్కో కొబ్బరికాయతో ఇలా దిష్టి తీయాలి అయితే ఈ పరిహారం చేయడానికి మంగళ శని గురువారాలు ఎంతో ముఖ్యమైనది.ఇక ఎవరైతే శని దోష ప్రభావంతో బాధపడుతుంటారో అలాంటి వారు శనీశ్వరుని అనుగ్రహం కోసం ప్రతిరోజు స్వామి వారిని పూజించడమే కాకుండా శని ప్రభావం మనపై లేకుండా ఉండటం కోసం అందులకు అన్నదానం చేయటం వల్ల శని ప్రభావ దోషం తొలగిపోతుంది.
Astro Tips : ఆర్థిక ఇబ్బందులు తప్పటం లేదా ఈ పనులు చేస్తే చాలు అదృష్టం మీ వెంటే..
ఈ పరిహారంతో పాటు ఎవరైతే మానసికక్షోభతో బాధపడుతున్నారో అలాంటి వారి తలపై దుప్పటిని 21సార్లు మడిచి పేదలకు దానం చేయాలి. ఇలా స్నానం చేయడం వల్ల కూడా దోషాలు తొలగిపోతాయి అయితే ఈ పరిహారం శనివారం చేయడం మంచిది. ఇక మన ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోవాలంటే పక్షులకు ఆహారం పెట్టడం ఎంతో ముఖ్యం. ఇలా పక్షులకు ఆహారం వేయడం వల్ల ఇంట్లో ప్రతికూల వాతావరణ పరిస్థితులు తొలగిపోయి అనుకూల వాతావరణ పరిస్థితులు ఏర్పడతాయి.
Read Also : Vastu Tips : ఎంత సంపాదించినా ఆర్థిక ఇబ్బందులు తప్పటం లేదా? అయితే ఇలా చేయండి మంచి ఫలితం ఉంటుంది?