Ashu Reddy : అందాల ముద్దుగుమ్మ.. బోల్డ్ బ్యూటీ అషు రెడ్డి.. బిగ్‌బాస్‌కు వెళ్లొచ్చాక మరింత ఫేమస్ అయింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూనే నెటిజన్లను ఆకర్షించేందుకు ఏదో ఒకటి చేస్తుంటుంది. అలాంటి సోషల్ మీడియా క్వీన్ అషు రెడ్డి నెట్టింట్లో చేసే రచ్చ మామూలుగా లేదు.. అషు రెడ్డి ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫొటోస్, వీడియోస్ షేర్ చేస్తోంది. ఆఫర్ల మీద ఆఫర్లతో బిజీగా గడిపేస్తున్న ఈ బ్యూటీ రెండు సార్లు బిగ్ బాస్‌హౌస్‌కి వెళ్లి వచ్చాక మరింత ఫేమ్ సాధించింది.
అంతటితో ఆగలేదు. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో బోల్డ్ ఇంటర్వ్యూలో మెరిసి మరింత పాపులారిటీ పెంచుకుంది అషు రెడ్డి. అన్నీ ఓపెన్‌గా శృంగారంపై మాట్లాడేసింది. రోజువారీ అలవాట్లను బయటపెట్టేసింది. బిగ్ బాస్ షో తర్వాత రాహుల్ సిప్లీగంజ్‌తో రిలేషన్‌లో ఉన్నట్టుగా వార్తలు వచ్చాయి. అనంతరం కమెడియన్ ఎక్స్‌ప్రెస్ హరితో లవ్ ట్రాక్ నడిపి అప్పట్లో బాగానే కలరింగ్ ఇచ్చింది. హరితో స్కిట్టులో కనిపిస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తోంది అషు రెడ్డి.
Ashu Reddy : విజయ్ దేవరకొండకు అషురెడ్డి వీడియో కాల్.. బిగ్ బాస్ బ్యూటీ రచ్చ మామూలుగా లేదుగా..!
ఇప్పుడు.. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండతో వీడియో కాల్ చేసి మాట్లాడింది అషు రెడ్డి. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్ తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసింది. ఆ వీడియో కాల్‌ను మాత్రం రివీల్ చేయలేదు. కానీ, ఇద్దరూ ఏం విషయంలో దేనిగురించి మాట్లాడుకున్నారు అనేది మాత్రం సస్పెన్స్ లో పెట్టేసింది బిగ్ బాస్ బ్యూటీ. ఈ ఫొటోను చూసిన వారంతా షాక్ అవుతున్నారు. విజయ్ దేవరకొండ, ఆషు రెడ్డి ఏ సమయంలో మాట్లాడుకుని ఉంటారు.. వీరిద్దరి మధ్య ఏ విషయంలో డిస్కషన్ నిజంగానే జరిగిందా అని నెటిజన్లు తెగ ఆశ్చర్యపోతున్నారు.
Read Also : Radhika Apte : నా భర్త వేస్ట్.. అసలే కోపరేట్ చేయడు.. రాధిక ఆప్టే షాకింగ్ కామెంట్స్..!
Tufan9 Telugu News providing All Categories of Content from all over world