Radhika Apte : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రాధిక ఆప్టే.. ఈ పేరు వింటే చాలు.. బోల్డ్‌కు పర్యాయపదం.. ఆమె పాత్రల్లో ఎక్కువగా అది లేకుండా ఉండవు. ఆ పాత్రలకే ఎక్కువగా కనెక్ట్ అవుతుంది ఈ అమ్మడు. ఆ విషయంలో ఏదైనా పాత్ర డిమాండ్ చేస్తే అందులో ఆప్టే ఇంకా రెచ్చిపోతుందనడంలో సందేహం అక్కర్లేదు. ఈ బోల్డ్ నెస్ కారణంగానే అనేకసార్లు రాధికా ఆప్టే చిక్కుల్లో పడింది. అయినా డోంట్ కేర్ అన్నట్టుగా ఈ ముద్దుగుమ్మ ముందుకు సాగుతోంది. ప్రస్తుతం విక్రమ్ వేదా మూవీ చేస్తోంది.

ఇప్పటివరకూ రాధిక ఆప్టే సినీ జీవితం మాత్రమే ఇంత బోల్డ్ ఉంటే.. ఆమె పర్సనల్ లైఫ్ ఉంటుందో తెలుసా? ఇంతకీ ఆప్టేకు పెళ్లి అయిందా? అంటారా? ఎప్పుడో పెళ్లి అయింది. ఎందుకంటే ఆమె ఎప్పుడూ కూడా తన పర్సనల్ లైఫ్ ఫొటోలను బయటపెట్టలేదు. అలాంటి రాధిక ఆప్టే తన భర్తతో కలిసి చెట్టాపట్టాల్ ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ సందర్భంగా రాధికా ఆప్టే షాకింగ్ విషయాలను బయటపెట్టేసింది.
Radhika Apte : నా భర్తకు అలా చేయడం చేతగాదు.. వేస్ట్.. రాధిక ఆప్టే అంత మాట అనేసింది..
ఇంటర్వ్యూలో భాగంగా.. భర్తతో కలిసి ఫొటోలు ఎందుకు దిగరు అనే ప్రశ్న ఎదురైంది. అందుకు రాధిక ఆప్టే నేను ఇక్కడ ఉంటే.. నా భర్త బెనెడిక్ట్) అక్కడ ఉంటాడు. కెరీర్ పరంగా నేను ముంబైలో ఉంటే, బెనెడిక్ట్ టేలర్ విదేశాల్లో ఉంటాడు. మేమిద్దరూ కలుసుకోడం చాలా తక్కువ. నా పనిలో నేను ఉంటాను. అతడి పనిలో అతడు బిజీగా ఉంటాడు.
నా పర్సనల్ విషయాలు బయట పెట్టడం నాకు నచ్చదు. ఫొటోలు దిగాలి… సోషల్ మీడియాలో షేర్ చేయాలనే ఆశ అంతకన్నా లేదంటోంది. ఈ విషయంలో నా కంటే భర్త బెన్ ఇంకా వేస్ట్ అంటోంది. అతడు ఫొటోలు దిగుదామని అనుకున్నా అసలే కోపరేట్ చేయ్యడట.. పెళ్లి అయ్యి పదేళ్లు (2012) దాటినా మ్యారేజీ ఫొటోలు ఒక్కటి కూడా లేవట.. పెళ్లి సమయంలో స్నేహితులను, దగ్గరవాళ్లను పిలిచామని, కానీ, పెళ్లి ఫొటోలు దిగడంపై పెద్దగా ఆసక్తి చూపలేదని తెలిపింది.
Read Also : Men Menstruation : అతడు మగాడే.. కానీ, 20 ఏళ్లుగా పీరియడ్స్.. స్కానింగ్‌లో గర్భాశయం.. షాకైన వైద్యులు..!