Karthika Deepam July 11 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతున్న కార్తీక దీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో హిమ ను సౌర్య ఇంటి దగ్గర దిగబెడుతుంది. ఈ రోజు ఎపిసోడ్ లో ఈరోజు ఎపిసోడ్ లో సౌర్యని హిమ ఇంట్లోకి రమ్మని చెప్పి ఎంత బ్రతిమలాడినా వినిపించుకోకుండా హిమ పై కోప్పడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత హిమ ఎమోషనల్ అవుతూ ఇంట్లోకి వెళ్లి కార్తీక్, దీపల ఫోటోల ముందు నిల్చుని బాధపడుతూ ఉండగా ఇంతలో సౌందర్య దంపతులు అక్కడికి వచ్చి ఏం జరిగింది హిమ? ఇంతసేపు ఎక్కడికి వెళ్లావు? ఎందుకు ఇలా తడిచిపోయావు అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేసినప్పటికీ హిమ మాత్రం ఏం మాట్లాడకుండా ఎమోషనల్ అవుతుంది.
అప్పుడు సౌందర్య ఏం జరిగిందో చెప్పు హిమ అని అనగా సౌందర్యన్ని హత్తుకుని సౌర్య రాను అని చెప్పింది నానమ్మ అనడంతో వాళ్లు బాధపడుతూ ఉంటారు. అంతేకాదు ఇంటి గుమ్మం వరకు వచ్చి ఇంట్లోకి రాకుండా వెళ్ళిపోయింది అనడంతో సౌందర్య ఆనందరావు బాధపడుతూ ఉంటారు. ఆ తర్వాత జ్వాలా ఇంటికి వెళుతూ ఉండగా ఇంతలో మధ్యలో శోభ వచ్చి అడ్డుపడి ఇవ్వాలని వెటకారంగా మాట్లాడిస్తుంది.
Karthika Deepam July 11 Today Episode : సూపర్ ట్విస్ట్.. శోభ చెంప చెల్లు.. స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన జ్వాలా..
నీకు ఒక విషయం చెప్పాలి. నువ్వే సౌర్యవి అన్న విషయం హిమకు బ్లడ్ క్యాంపులో తెలిసింది. అంతేకాకుండా నువ్వు డాక్టర్ సాబ్ ని ప్రేమిస్తున్నావు అని తెలిసిన తర్వాత కావాలనే క్యాన్సర్ ఉంది రెండు నెలలు మాత్రమే బతుకుతాను అని నాటకాలు ఆడి అందరినీ ఒప్పించి మీ డాక్టర్ సాబ్ ని పెళ్లి చేసుకోబోతోంది అని అంటుంది శోభ. అప్పుడు జ్వాలా కోసం ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అనగా.. నిజాలు మాట్లాడుతున్నాను సౌర్య అని అంటుంది. అప్పటికే కోపంతో రగిలిపోతున్న సౌర్య శోభ చెంప చెల్లుమనిపించి థాంక్స్ అని చెప్పి ఇలాంటి పిచ్చి పిచ్చి సలహాలు నాకు ఇవ్వకు అంటూ గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. మరొకవైపు సౌందర్య, ఆనంద్ రావు లు భోజనం తింటూ ఉండగా హిమ మాత్రం భోజనం చేయకుండా శౌర్య గురించి తలచుకొని బాధపడుతూ ఉంటుంది.
అప్పుడు నాకు ఆకలిగా లేదు నానమ్మ నేను శౌర్య ఇంటికి వెళ్తాను అని చెప్పి సౌర్య ఇంటికి బయలుదేరుతుంది. మరొకవైపు సౌర్య శోభ అన్న మాటలను తలుచుకొని బాధపడుతూ ఉండగా ఇంతలో జ్వరం వచ్చినట్టుగా అనిపించడంతో పడుకుంటుంది. ఆ తర్వాత శోభ జ్వాలా కొట్టిన చెంప దెబ్బనే తలుచుకుంటూ ఈ జ్వాలా మామూలుది కాదు అని జ్వాలపై కోపంతో రగిలిపోతూ ఉంటుంది. మరొకవైపు జ్వాలకి జ్వరం రావడంతో ఇంద్రమ్మ దంపతులు సేవలు చేస్తూ ఉంటారు. అప్పుడు సౌర్య పరిస్థితిని తలుచుకొని వాళ్ళు బాధపడుతూ మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలోనే అక్కడికి హిమ వచ్చి సౌర్య పరిస్థితి చూసి చలించిపోతుంది. ఆ తర్వాత అంబులెన్స్ కి ఫోన్ చేసి పిలిపిస్తుంది. సౌర్య నిద్ర లేచి చూసేసరికి సౌందర్య నాకు ఏమైంది నేను ఎందుకు ఇక్కడ ఉన్నాను అని తనలో తానే ఆలోచించుకుంటూ ఉంటుంది. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.
Read Also : Karthika Deepam July 9 Today Episode : శోభ చెంప చెల్లుమనిపించిన జ్వాలా.. జ్వాలాకి సేవలు చేస్తున్న హిమ..?