Anchor Shyamala : యాంకర్ శ్యామల గురించి తెలుగు ప్రజలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బుల్లి తెరతో పాటు వెండి తెరపై పలు సినిమాలు, షోలు చేస్తూ.. వేలాది మంది అభిమానులను సొంతం చేసుకుంది. టీవీ సీరియళ్ల నుంచి మొదలైన ఆమె ప్రస్థానం.. యాంకర్ గా, నటిగా కొనసాగింది.
అయితే బిగ్ బాస్ షోకి వెళ్లి మరింత మంది అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించుకుంది. వంటల షోలతో బాగా పాపులర్ అయిన ఆమె.. ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటోంది. ఇటీవలే కాంట్రవర్సిటీకి కేరాఫ్ అడ్రస్ అయిన డైరెక్టర్ రాంగోపాల్ వర్మ చేసిన హాట్ కామెంట్స్ తో శ్యామల మరో సారి ట్రెండ్ లోకి వ్చచింది. యాంకర్ శ్యామల ముంబైకి వెళ్లిన విషయం తెలిసిందే. అయితే ఈ భామ రీసెంట్ గా ఓ డ్యాన్స్ వీడియోను పోస్ట్ చేసింది.
ఇక అంతే తన డాన్స్ ఇఫ్పుడు వైరల్ గా మారింది. అయితే ఈ డ్యాన్స్ వీడియోపై అభిమానులు రకరకాల కామెంట్ల చేస్తున్నారు. ఓ బిడ్డకు తల్లి అయిన నీకు ఇదంతా అవసరమా అని కొందరు.. అటు అమ్మగా, ఇటిగా నటిగా పూర్తి స్థాయిలో తన బాధ్యతలు నిర్వహిస్తుందంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.
Read Also : RGV Comments : యాంకర్ శ్యామలపై ఆర్జీవీ కన్ను పడింది.. నా కళ్ల నుంచి ఇన్నాళ్లు ఎలా తప్పించుకున్నావు..!