...

RGV Comments : యాంకర్ శ్యామలపై ఆర్జీవీ కన్ను పడింది.. నా కళ్ల నుంచి ఇన్నాళ్లు ఎలా తప్పించుకున్నావు..!

RGV Comments : వివాదాస్పదాలకే కేరాఫ్ అడ్రస్.. సంచలన దర్శకుడు ఆర్జీవీ.. ఏం చేసినా ఏం మాట్లాడినా అది సంచలనమే.. పబ్లిసిటీ కోసం ఆయన ఏమైనా చేస్తాడు.. అది సెన్సేషన్ అవ్వాల్సిందే. ఆర్జీవీ గతంలోనూ అరియానా గ్లోరీ, అషు రెడ్డిలపై బోల్డ్ కామెంట్స్ చేశాడు.. ఇప్పుడు ఆర్జీవీ కన్ను యాంకర్ శ్యామలపై పడింది. అంతటితో ఆగలేదు.. ఇంత అందంగా ఉన్న నువ్వు ఇన్నాళ్లు నా కళ్ల నుంచి ఎలా తప్పించుకున్నావు అంటూ బోల్డ్ కామెంట్స్ చేశాడు ఆర్జీవీ.. ఆర్జీవీ కామెంట్లతో బిత్తరపోయిన శ్యామల ఎలా రియాక్ట్ అవ్వాలో షాకింగ్ లో ఉండిపోయింది.

గతంలోనూ ఇంటర్వ్యూలో పాల్గొన్న అరియానా, అషు రెడ్డిలపై బోల్డ్ కామెంట్స్ చేశాడు ఆర్జీవీ. ఇటీవలే బడవ రాస్కెల్ (Badava Rascal Movie) అనే మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకుంది. ఈ ఈవెంట్‌కు హాజరైన రామ్ గోపాల్ వర్మ.. ఈవెంట్‌ను హోస్ట్ చేస్తున్న యాంకర్ శ్యామలపై హాట్ కామెంట్స్ చేశాడు. తానొక రాస్కెల్ అంటూ యాంకర్ శ్యామలను ఆర్జీవీ తెగ పొగిడేశాడు.. ఆర్జీవీ మాటలకు యాంకర్ శ్యామల సిగ్గుపడి నవ్వేసింది. ఇంత అందంగా ఉన్న మీరు నా కళ్లలోంచి ఎలా తప్పించుకున్నారు అంటూ యాంకర్ శ్యామలపై కామెంట్స్ చేశాడు.

‘పుష్ప‌’ సినిమాలో జాలిరెడ్డిగా నెగెటివ్ రోల్ కనిపించిన కన్నడ హీరో ధ‌నుంజ‌య్ ‘బ‌డ‌వ రాస్కెల్‌’ సినిమాను తెలుగులో రిలీజ్ చేయనున్నారు. ఫిబ్రవరి 18న ఈ సినిమా రిలీజ్ కానుంది. మంగళవారం సాయంత్రం ఈ మూవీ (Badava Rascal Pre Release Event) ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్‌కి ఆర్జీవీ చీఫ్ గెస్ట్‌గా వచ్చిన ఆర్జీవీ హోస్ట్ చేస్తున్న యాంకర్ శ్యామలపై హాట్ కామెంట్స్ చేశాడు.

ఆర్జీవీ కామెంట్లపై వెంటనే రియాక్ట్ అయిన యాంకర్ శ్యామల ఆర్జీవీ వచ్చినప్పుడు తోపు, రౌడీ, గుండా అనే పడాలని వాడుతూ పొగిడింది. వెంటనే ఆర్జీవీ కూడా రిప్లయ్ ఇస్తూ.. నువ్వు నన్ను తోపు, రౌడీ ఇలా అన్నావు.. వాటితో పాటు నేను రాస్కెల్ కూడా అంటూ తనపైనే సెటైర్ వేసుకున్నాడు ఆర్జీవీ. రాస్కెల్ అంటే.. బడవ రాస్కెల్ అని యాంకర్ శ్యామల తిరిగి సెటైర్ వేసింది. ఇప్పుడు యాంకర్ శ్యామల, ఆర్జీవీ కామెంట్స్ ట్రెండింగ్‌గా మారాయి.

Read Also : Extra Marital Affair : ఆ విషయం బయట పడుతుందని కన్న కూతురునే కడతేర్చిన కసాయి తల్లి..!