Intinti Gruhalakshmi: మళ్లీ దగ్గరవుతున్న సామ్రాట్ తులసి.. కోపంతో రగిలిపోతున్న అనసూయ..?

Anasuya gets irritated with Samrat and Tulasi's closeness in todays intinti gruhalakshmi serial episode
Anasuya gets irritated with Samrat and Tulasi's closeness in todays intinti gruhalakshmi serial episode

Intinti Gruhalakshmi: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో తులసి లాస్య కుటుంబ సభ్యులు బతుకమ్మ సంబరాలు చేసుకుంటూ ఉంటారు.

ఈరోజు ఎపిసోడ్ లో నందు, లాస్య ఓడిపోతారు. ఓఆ తరువాత అనసూయ, పరంధామయ్యలు కూడా ఊడిపోతారు. ఆపై శృతి ప్రేమ్ ఇద్దరు గెలవడంతో వెంటనే తులసి మీరిద్దరూ అన్యోన్య దంపతులను నాకు తెలుసు అందులోనే మీరు లవ్ మ్యారేజ్ కదా అని అంటుంది తులసి. దాంతో ప్రేమ్, శృతి ఇద్దరు లోలోపల బాధపడుతూ ఉంటారు. ఆ తర్వాత అందరూ కలిసి మరొక గేమ్ ని ఆడతారు.

Advertisement

అందులో భర్త కళ్ళకు గంతులు కట్టుకోగా భార్య దారి చెబుతూ గెలిపించాలి. అయితే ప్రేమ్, శృతి లు, నందు, లాస్య లు ఆడినప్పటికి చివరికి అంకిత,అభిలు గెలుస్తారు. అప్పుడు తులసి సంతోషంతో అభి దగ్గరికి వచ్చి ఇదే నీ జీవితం అనుకో అభి అంకిత చెప్పినట్టు విను నువ్వు జీవితంలో ఎత్తుకు ఎదుగుతావు అని చెబుతుంది తులసి. ఇంతలోనే సామ్రాట్ అక్కడికి రావడం చూసి తులసి ఆనంద పడుతూ ఉంటుంది.

Advertisement

ఇప్పుడు సామ్రాట్ అక్కడికి వచ్చి తులసి వారి కుటుంబం పై కోపంతో మాట్లాడుతూ ఉంటాడు. హనీకి కడుపునొప్పి అని చెప్పింది మీ ఇంట్లో అందరికీ ఫోన్ చేసినా ఒక్కరు కూడా లిఫ్ట్ చేయలేదు. ఇప్పుడు ఎలా ఉంది అని సామ్రాట్ అడగగా, ఏమైంది తులసి గారు మీ అందరూ ఫోన్ లిఫ్ట్ చేయలేదు నేను నరకం అనుభవించానో తెలుసా అని అంటాడు సామ్రాట్.

ఇప్పుడు తులసి హనీకి కడుపునొప్పి అని నాకు చెప్పలేదు అనగా వెంటనే హనీ నాకు నొప్పి లేదు నాన్న ఊరికే రమ్మని పిలిచాను ఆటంతో అందరూ ఆశ్చర్యపోతారు. తర్వాత సామ్రాట్ అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉండగా హానీతో పాటు పరంధామయ్య అక్కడే ఉండమని అడగడంతో అందుకు సరే అని అంటాడు సామ్రాట్. ఆ తర్వాత అందరూ కలిసి కోలాటం ఆడుతూ ఉంటారు.

Advertisement

అప్పుడు మొదట పరంధామయ్య,అనసూయలు పక్కకు తప్పుకోగా ఆ తర్వాత తులసి ప్రేమ్ లు పక్కకు తప్పుకుంటారు. ఇక చివరిగా అభి అంకితలు కూడా పక్కకు వెళ్లిపోవడంతో లాస్య దంపతులు, సామ్రాట్ తులసిలు మాత్రమే మిగులుతారు. అప్పుడు తులసి సామ్రాట్ ఇద్దరు సంతోషంగా కోలాటం ఆడుతూ ఉండడంతో అది చూసి లాస్య జీర్ణించుకోలేకపోతుంది. అనసూయ కూడా కోపంతో రగిలిపోతూ ఉంటుంది.

అప్పుడు సామ్రాట్ కోలాటం ఆడుతూ ఇక చాలు తులసి గారు ఆపండి అని అనడంతో లేదు సామ్రాట్ గారు అని అంటుంది. అల వారిద్దరూ నవ్వుకుంటూ ఉండగా నలుగురు నానా రకాలుగా అనుకుంటూ ఉంటారు. అది చూసిన అనసూయ మరింత కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక చివరికి ఆ పోటీలో తులసి గెలుస్తుంది. సామ్రాట్ గారు నన్ను గెలిపించారు అని సామ్రాట్ కి థాంక్స్ చెబుతుంది తులసి.

Advertisement

ఆ తర్వాత అక్కడ ఉన్న యాంకర్ తులసి గారిని హారతి ఇవ్వడానికి ఆహ్వానిస్తున్నాము అని అనడంతో అప్పుడు తులసి అత్తయ్య మీరు కూడా రండి అని అనగా అనసూయ నేను రాను నువ్వు వెళ్ళు అని కోపంగా మాట్లాడుతుంది. ఆ తర్వాత తులసి హారతి ఇవ్వడానికి వెళ్తుండగా ముత్తైదువులు అడ్డుపడతారు.

Advertisement