Alia bhatt pregnnt: గుడ్ న్యూస చెప్పిన ఆలియా భట్.. తల్లికాబోతున్నానంటూ పోస్ట్!

Alia bhatt pregnnt: బాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్ రణ్ బీర్, ఆలియా భట్ ల గురించి ప్రత్యేంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఎన్నో ఏళ్లుగా ప్రేమలో ఉన్న వీళ్లు ఈ ఏడాది ఏప్రిల్వ తేదీన పెళ్లి చేస్కున్న సంగతి కూడా అందరికీ తెలిసిందే. అయితే పెళ్లై ఇంకా మూడు నెలలు కూడా కాకముందే ఈ జంట గుడ్ న్యూస్ చెప్పేసింది. తాను తల్లికాబోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకుంది. త్వరలోనే తమ బిడ్డ రాబోతుందంటూ ఆసుపత్రిలో స్కానింగ్ ఫొటోస్ షేర్ చేసింది. అయితే పక్కనే రణబీర్ కపూర్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

ఇటీవలే వీరిద్దరూ ప్రధాన పాత్రలో బ్రహ్మాస్త్రం సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో రూపొందించిన ఈ సినిమాను… అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్ పార్ట్ ని శివ పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. పాన్ ఇండియా స్థాయిలో సెప్టెంబర్ 9న హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. ఇందులో అమితాబ్ బచ్చన్, మౌనీ రాయ్ కీలక పాత్రలో నటిస్తుండగా… టాలీవుడ్ స్టార్ హీగో నాగార్జున సైతం ముఖ్య పాత్రలో కనిపించబోతున్నారు.

 

Advertisement
View this post on Instagram

 

A post shared by Alia Bhatt 🤍☀️ (@aliaabhatt)

Advertisement

Advertisement