Janaki Kalaganaledu june 27 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో జ్ఞానాంబ, జానకి గోరుముద్దలు పెడుతుండడంతో అది చూసి మల్లికా కుళ్ళు కుంటూ ఉంటుంది.
ఈరోజు ఎపిసోడ్ లో జ్ఞానాంబ కోసం జానకి ఫిల్టర్ కాపీ చేయాలి అని ప్రయత్నిస్తుంది. అయితే తనకు ఫిల్టర్ కాఫీ ఎలా పెట్టాలో తెలియక రామచంద్ర అక్కడికి రావడంతో అతని సహాయం తీసుకుని కాఫీ చేస్తుంది. అలా వారిద్దరూ కాసేపు రొమాంటిక్ గా మాట్లాడుకుంటూ ఉంటారు.
మరొక వైపు గోవిందరాజులు కాఫీ,జ్ఞానాంబ కాఫీ కోసం ఎదురు చూస్తూ ఉండగా ఇంతలోనే జానకి కాపీ తీసుకుని రావడంతో గోవిందరాజులు సంతోష పడుతూ ఉంటాడు. ఇంతలో అటుగా వెళ్తున్న మల్లిక పొద్దు పొద్దున్నే పెద్ద కోడలికి ఏదో సన్మాన కార్యక్రమం చేస్తున్నారు అని చాటుగా వింటూఉంటుంది.
అప్పుడు గోవింద రాజులు జానకిని పోవడంతో మల్లికా కుళ్ళు కుంటూ ఉంటుంది. జానకి వీరి మాటలు వింటుంది అని పసిగట్టిన గోవిందరాజులు అదేపనిగా మల్లిక ముందు జానకిని ఇంకా ఎక్కువగా ఎక్కువగా పొగుడుతూ మల్లికను వెటకారంగా మాట్లాడుతాడు.
అప్పుడు మల్లిక దగ్గరికి పిలిచి గోవిందరాజులు సరదాగా మాట్లాడుతూ ఉండగా,అప్పుడు జ్ఞానాంబ మల్లిక,జానకి లను పిలిచి మీరిద్దరూ నా కూతురు లాంటి వాళ్లు ఇద్దరిని ఒకేలా చూస్తాం అని అంటుంది. అంతేకాకుండా జానకిని సొంత అక్కలా చూసుకోవాలి అని అనడంతో మల్లిక మనసులో కొట్టుకుంటూ ఉంటుంది.
అప్పుడు గోవిందరాజులు,రామను అడుగుతూ జానకి ఫిల్టర్ కాఫీ పెట్టడానికి సహాయం చేశావు కదా అని అనడంతో అప్పుడు రామచంద్ర చెప్పడానికి కాస్త ఇబ్బంది పడుతూ ఉండడంతో మొత్తానికి రామచంద్రనే కాఫీ పెట్టాడు అని వాళ్ళకి అర్థమవుతుంది. ఆ తర్వాత జానకి ఫంక్షన్ కు వెళ్లడానికి రెడీ అవుతుంది.
అప్పుడు జానకి ఏ చీర కట్టుకోవాలి సెలక్షన్ చేయండి అని రామాను అడగగా, అప్పుడు రామచంద్ర వంటల ప్రోగ్రాం లో సులువుగా అయిన గెలవచ్చు కానీ చీరల సెలక్షన్ లో గెలవడం చాలా కష్టం అంటూనే జానకి అనుకున్న చీరనే సెలెక్ట్ చేయడంతో మన ఇద్దరి అభిరుచులూ ఒకటే అని అంటుంది జానకి.
Tufan9 Telugu News And Updates Breaking News All over World