Viral video : సోషల్ మీడియాలో చాలా వీడియోలు వస్తుంటాయి. అందులో కొన్ని మాత్రమే అందరినీ అలరించేవి ఉంటాయి. మరికొన్ని భలే మజా తెప్పిస్తాయి. ఆయా వీడియాల్లో వాళ్లు చేసే డ్యాన్సు చూసే వాళ్లకు కూడా ఊపు తెప్పిస్తుంది. ఇంకొన్ని వీడియోలు చూస్తే అరె భలే చేశారు డ్యాన్స్ అనిపిస్తుంది. అచ్చంగా అలాంటి వీడియోనే కోల్ కతా నటి తన ఇన్ స్టాగ్రాం అకౌంట్ లో పోస్టు చేసింది. ఆ వీడియోలో ఏం ఉందంటే..
పశ్చిమ బెంగాల నటి మోనామీ ఘోష్ కు సోషల్ మీడియా మాంచి ఫాలోయింగ్ ఉంది. ఆమె పెట్టే చేసే ప్రతి పోస్టుకు లక్షల్లో వ్యూస్ వస్తుంటాయి. డ్యాన్స్ చేస్తూ దానిని వీడియో తీసి సోషల్ మీడియా అకౌంట్ లలో షేర్ చేసే వీడియోలను చాలా మంది చూస్తుంటారు. మోనామీ ఘోష్ డ్యాన్స్ కు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉందంటేనే అర్థం చేసుకోవచ్చు. ఘోష్ ఎంత బాగా నర్తిస్తుందో. అయితే తాజాగా ఆమె ఓ వీడియో పోస్టు చేసింది. అందులో మోనామీ ఘోష్ విమాన సిబ్బందితో డ్యాన్సు చేస్తూ కనిపించింది.
ఈ వీడియోను కోల్ కతా ఎయిర్ పోర్టు ప్రాంగణంలో చిత్రీకరించినట్లు మోనామీ ఇన్ స్టాలో వెల్లడించింది. స్పైస్ జెట్ విమాన సిబ్బందితో కలిసి చేసిన డ్యాన్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఇందులో స్పైస్ జెట్ సిబ్బంది యూనిఫాం వేసుకుని ఉన్నారు. మోనామీ ఘోష్ మాత్రం నీలి రంగు డ్రెస్సులో ఉంది. వీరంతా కలిసి కోల్ కతా విమానాశ్రయంలో ఫ్లాష్ మాబ్ నిర్వహించారు. ఈ వీడియోకు ఇప్పటి వరకు 4.7 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. అయితే ఇది ఏదైనా ప్రమోషన్ కోసం చేసిందా.. లేదా మామూలుగానే చేశారా అని మాత్రం చెప్పలేదు.
AdvertisementView this post on Instagram
AdvertisementAdvertisement