Rudraksha: రుద్రాక్ష పరమ శివుడికి ఎంతో ప్రీతి పాత్రమైనది. రుద్రాక్ష మహాదేవుని కన్నీటి నుండి ఆవిర్భవించిందని హిందూ సాంప్రదాయం చెబుతోంది. శివయ్య ఒంటి నిండా రుద్రాక్షలు ధరిస్తాడు. ఆ పరమ దేవుడిని ఆరాధించే వారు కూడా రుద్రాక్షఘ ధరిస్తారు. రుద్రాక్షల్లో చాలా రకాలు ఉంటాయి. ఒక్కొక్కరు ఒక్కో సమస్యకు ఒక్కో రకమైన రుద్రాక్షను ధరిస్తారు. వీటిని రాశిని బట్టి ధరిస్తే మంచి ప్రయోజనం ఉంటుందని చెబుతారు.
అయితే ఏ రాశి వారు ఎలాంటి రుద్రాక్ష ధరించాలో ఒకసారి తెలుసుకుందాం.
మేషం: వీరు ఏక ముఖి రుద్రాక్ష ధరిస్తే మంచి జరుగుతుంది. మేషం రాశి వారు ఏక ముఖి రుద్రాక్షతో పాటు 3 ముఖాలు లేదా ఐదు ముఖాల రుద్రాక్షను కూడా ధరించవచ్చు.
వృషభం: వృషభ రాశి వారు నాలుగు ముఖి, ఆరు ముఖి, పద్నాలుగు ముఖాల రుద్రాక్షలను ధరించవచ్చు.
కన్య: వీరు శివయ్య అనుగ్రహం పొందాలంటే నాలుగు, ఐదు లేదా పదమూడు ముఖాల రుద్రాక్షలను ధరించాలి.
మిథునరాశి: మిథున రాశి వారు నాలుగు, ఐదు లేదా పదమూడు ముఖాల రుద్రాక్షలను ధరించవచ్చని చెబుతారు.
కర్కాటకం: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, కర్కాటక రాశి వారు మూడు, ఐదు లేదా గౌరీ శంకర్ రుద్రాక ధరించవచ్చు.
సింహం: ఈ రాశి వారు ఏకముఖి రుద్రాక్ష ధరిస్తే అంతా మంచే జరుగుతుంది. దీంతో పాటు మూడు లేదా ఐదు ముఖాల రుద్రాక్షలను కూడా ధరించవచ్చు.
తుల: నాలుగు, ఆరు లేదా పద్నాలుగు ముఖి రుద్రాక్షను ధరించాలి.
వృశ్చిక రాశిచక్రం: వృశ్చిక రాశి ప్రజలు మూడు, ఐదు ముఖి లేదా గౌరీ రుద్రాక్ష ధరించవచ్చు.
ధను రాశి: ధనుస్సు రాశి వారికి ఒక ముఖి రుద్రాక్షలను ధరించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది.
మకరం: నాలుగు ముఖాల రుద్రాక్ష వారికి శుభప్రదం.
కుంభం: నాలుగు, ఆరు లేదా పద్నాలుగు ముఖాల రుద్రాక్ష ధరించవచ్చు.
మీనం: ఏకముఖి లేదా మూడు ముఖాల రుద్రాక్ష ధరించవచ్చు.
Read Also : Horoscope: ఈ రెండు రాశుల వారు లక్ష్మీ దేవిని స్తుతిస్తే చాలు.. పట్టిందల్లా బంగారమే!