Chanakya neethi : సాధారణంగా ప్రతీ ఒక్కరూ తమ జీవితంలో ఎవరో ఒకరిని బాగా నమ్ముతుంటారు. అన్ని విషయాలను వారితో పంచుకుంటూ ఉంటారు. కొంత మంది మన నమ్మకానికి అనుగుణంగా ఉంటూ.. మన విషయాలను వేరే ఎవరితోనూ చెప్పరు. కానీ కొందరు మనం చెప్పిన విషయాలను అడ్డుపెట్టుకొని మనల్నే బ్లాక్ మెయిల్ చేయాలని చూస్తుంటారు. అయితే మనకు ఎవరు నమ్మక ద్రోహం చేయాలన్నా… అది మనం వారికిచ్చే చనువు పైనే ఆధారపడి ఉంటుందని చెబుతుంటారు. అలాంటి పరిస్థితులు మనకు ఎదురు కాకుండా ఉండేందుకు పలు సూత్రాలను గురించి చెప్పాడు. అయితే అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఆయుధాలు కల్గిన వ్యక్తులను అస్సలే నమ్మకూడదట. అలాంటి వారికి కోపం వస్తే మనల్ని ఏమైనా చేయగలరని చాణక్య చెప్పారు.
అధికారులకు సన్నిహితులు… వీరి వల్ల మనకు చెడు జరిగే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఇలాంటి వారిని వీలైనంత దూరం పెట్టాలి.
స్వార్థంగా ఉండే వాళ్లను ఎట్టి పరిస్థితుల్లో నమ్మకూడదు. ఎందుకంటే స్వార్థపరులు తమ కోసం వేరే వాళ్లను ఏం చేయడానికైనా వెనుకాడరు.
కొమ్ములు, గోర్లు కల్గిన జంతువులను కూడా అస్సలే నమ్మకూడదని ఆచార్య చాణక్యుడు వివరించాడు. ఆయన చెప్పిన నీతి సూక్తులు పాటిస్తే… మీ జీవితం చాలా హాయిగా, సంతోషంగా, ఎలాంటి కష్టాలు లేకుండా సాగుతుంది.