...

Karnataka : 50 అడుగుల డ్యామ్ పైకి ఎక్కబోయి కింద పడిన యువకుడు.. వీడియో వైరల్!

Karnataka : ప్రస్తుత కాలంలో యువత పై సినిమాల ప్రభావం ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే ఎంతో మంది యువత సినిమాలలో మాదిరిగా వినూత్నమైన సాహసాలు చేయడానికి ఏమాత్రం వెనుకడుగు వేయడం లేదు. ఈ క్రమంలోనే కొన్నిసార్లు ఎన్నో తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కోవడమే కాకుండా మృత్యువాత కూడా పడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి కర్ణాటకలో చోటు చేసుకుంది.కర్ణాటకలోని  చిక్ బళ్లాపూర్ జిల్లాలోని శ్రీనివాస సాగర్ డ్యాం నిండుకుండలా ఉండడమే కాకుండా డ్యామ్ పొంగిపొర్లుతోంది. ఈ క్రమంలోనే పెద్దఎత్తున నీటిని చూడటం కోసం సందర్శకులు అక్కడికి చేరుకున్నారు.

Karnataka
Karnataka

ఇలా అందరూ ఎంతో సంతోషంగా అక్కడికి చేరుకొని ఫోటోలు వీడియోలు తీసుకుంటూ ఉండగా 20 సంవత్సరాల కుర్రోడు అత్యంత ఉత్సాహం కనపరిచాడు. పై నుంచి నీళ్లు కింద పడుతున్నప్పటికీ ఈ కుర్రాడు అత్యుత్సాహంతో ఆ గోడను ఎక్కడానికి ప్రయత్నం చేశాడు. సుమారు యాభై అడుగుల ఎత్తులో ఉన్న ఆ గోడను ఎక్కుతున్న క్రమంలో చేయి పట్టు తప్పిపోయింది. దీంతో ఒక్కసారిగా ఆ కుర్రాడు పై నుంచి కిందకి జారి పడ్డాడు. కింద పడటంతో ఆ కుర్రాడిని వెంటనే చికిత్స నిమిత్తం బెంగళూరు ఆస్పత్రికి తరలించారు.

బెంగళూరులోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆ కుర్రాడు మృతి చెందాడు. ఆ కుర్రాడు గోడ పైకి ఎక్కుతున్న సమయంలో అక్కడ చాలామంది ఉన్నారు. ఎవరు కూడా అతనిని పైకి ఎక్కవద్దని వారించలేదు.అయితే ఆ కుర్రాడు పైనుంచి కింద పడటంతో వెంటనే స్పందించిన స్థానికులు అతనిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినప్పటికీ ఏ విధమైనటువంటి ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో ఆ కుర్రాడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఇక ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Read Also : F3 Movie : ఆకట్టుకుంటున్న ఎఫ్ 3 పార్టీ వీడియో సింగ్.. రెచ్చిపోయిన బుట్టబొమ్మ?