Dreams : కలలు రావడం ప్రతి ఒక్కరి విషయంలో సర్వ సాధారణంగా జరిగే అంశం. మనం బాగా అలా నిద్రపోతున్న సమయంలో లేదా మన మనస్సు ప్రశాంతంగా ఉన్న సమయంలోను కలలు రావడం జరుగుతుంటాయి. అయితే పగలు పడుకున్నప్పుడు కూడా కొందరికి కలలు వస్తుంటాయి. అలాగే మరికొందరికి రాత్రివేళల్లో, మరికొందరికీ తెల్లవారుజామున ఇలాంటి కలలు వస్తుంటాయి.అయితే కొందరికి మంచి కలలు రాగా మరికొందరికి చెడు కలలు కనిపిస్తున్నాయి.
అయితే కలలో కొన్ని రకాల వస్తువులు తరచు కనపడటం వల్ల మీరు త్వరలోనే ధనవంతులు కాబోతున్నారని చెప్పడానికి సంకేతం. మరి ఎలాంటి కలలు రావడం వల్ల మనం ధనవంతులవబోతున్నాం అనే విషయానికి వస్తే…
మనకి కలలో గుర్రం కనిపించి గుర్రంపై మనమే స్వయంగా స్వారీ చేస్తున్నట్టు కలలు వస్తే త్వరలోనే మనం చేసే పనులలో విజయం సాధిస్తామని, మన సంపాదన కూడా మెరుగు పడుతుందని అర్థం. వ్యాపారాలు చేసే వారికి వ్యాపార రంగంలో అభివృద్ధి సాధిస్తారు. అదేవిధంగా కలలో చాలామందికి జుట్టు కత్తిరించినట్టు కలలు వస్తాయి. ఇలా జుట్టు కత్తిరించి నట్టు కల కనుక వస్తే అప్పటి వరకు ఉన్న మన సమస్యలన్ని కూడా తొలగిపోతాయని అర్థం.
చాలామందికి కలలో మొహం అద్దంలో చూసుకున్నట్టు కలలు వస్తాయి. ఇలాంటి కలలు రావడం వల్ల ప్రేమ జీవితంలో ఇష్టమైన వారి నుంచి ప్రేమ అనుభూతులను పొందుతారని అర్థం. ముఖ్యంగా ఇలాంటి కలలు ఆడవారికి ఎక్కువగా వస్తాయి. మన చుట్టూ నల్లటి మేఘాలు కమ్ముకున్నట్లు కలలు వస్తే చాలా మంది భయపడుతుంటారు. అయితే అలాంటి కలలు రావడం శుభానికి సంకేతం. మన హిందూ ధర్మశాస్త్రం ప్రకారం తమలపాకులు శుభానికి సంకేతం. కలలో తమలపాకులు కనబడితే సంపద కలుగుతుందని అర్థం.
Read Also : Money plant : మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా.. అయితే ఈ నియమాలు పాటిస్తేనే ప్రయోజనం
Tufan9 Telugu News And Updates Breaking News All over World