F3 Movie : ఆకట్టుకుంటున్న ఎఫ్ 3 పార్టీ వీడియో సింగ్.. రెచ్చిపోయిన బుట్టబొమ్మ?

F3 Movie : అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఎఫ్ 2 ఈ సినిమాకి సీక్వెల్ చిత్రంగా ఈ నెల 27వ తేదీన ఎఫ్ 3 ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ క్రమంలోనే పెద్దఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా చిత్రబృందం ఇంటర్వ్యూలలో పాల్గొని ఈ సినిమాకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకోవడమే కాకుండా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ విడుదల చేస్తూ సినిమాపై భారీ అంచనాలు పెంచారు.

F3 Movie
F3 Movie

తాజాగా ఈ సినిమా నుంచి స్పెషల్ సాంగ్ వీడియోని మేకర్స్ విడుదల చేశారు. లైఫ్ అంటే ఇట్టా ఉండాలా’ అంటూ సాగే వీడియో సాంగ్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. 1.20 నిమిషాల నిడివిగ‌ల ఈ వీడియో సాంగ్ ప్రేక్ష‌కుల‌ను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ఈ పాటలో పూజాహెగ్డే స్టెప్పులు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. పూజా హెగ్డే, వరుణ్ తేజ్, వెంకటేష్ ముగ్గురు కలిసి నటించిన ఈ పాటకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Advertisement

దేవీ శ్రీ ప్ర‌సాద్ స్వ‌ర ప‌రిచిన ఈ పాట‌కు కాస‌ర్ల శ్యామ్ సాహిత్యాన్ని అందించ‌గా, రాహుల్ సిప్లీగంజ్‌, గీతా మాధురి ఈ పాటలు ఎంతో అద్భుతంగా ఆలపించారు. ఇక ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో దిల్ రాజు, శిరీష్ ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. వెంకటేష్ ,వరుణ్ తేజ్, తమన్నా, మెహరీన్, సోనాల్ చౌహాన్ ఈ సినిమాలో ప్రధాన పాత్రలలో నటించారు. ఇకపోతే పుట్టబొమ్మ పూజాహెగ్డే స్పెషల్ సాంగ్ ద్వారా ఈ సినిమాలో ప్రేక్షకులను సందడి చేయనున్నారు.

Read Also : F3 Movie: F3 మూవీలో స్పెషల్ ఐటెం సాంగ్ చేసేది ఎవరో గుర్తుపట్టారా? రెమ్యునురేషన్ తెలిస్తే షాకే..!

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Tufan9 Telugu News And Updates Breaking News All over World

RELATED POSTS

Join our WhatsApp Channel