మన ఉరుకుల పరుగుల జీవితాల్లో.. నవ్వు కూడా నకిలీగా మారిపోయింది. ఇప్పుడు చాలా మంది ఎరినీ చూసినా ఓ ఫేక్ స్మైల్ ఇస్తున్నారు. ఫొటోల్లో ఫోజులంటే ఇంక చెప్పాల్సిన అవసరమే లేదు. నవ్వు రాకపోయినా నవ్వుతూ… ఫొటోలు దిగి సామాజిక మాధ్యమాల్లో పెట్టేస్తున్నారు. కానీ ఓ బామ్మ.. విసిరిన నవ్వు చూస్తే ప్రతీ ఒక్కరూ ఫిదా అవ్వాల్సిందే. చిన్న పిల్లలా ఎలాంటి కల్మషం లేకుండా ఆమె ఇచ్చే స్మైలుకు వందలాది మంది అభిమానులుగా మారిపోతున్నారు. అసలు ఆమెకు అంత ఆనందం ఏం వేసింది, ఎందుకు ఆమె అంత అందంగా నవ్విందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ బామ్మ పేరు కుట్టియమ్మ. ఈమె కేరళలోని కొట్టాయంలో ఉంటోంది. అయితే ఆమె కేరళ లిటరసీ మిషన్ పరీక్షలో 100 మార్కులకు గాను 89 మార్కులను సంపాదించింది. అయితే ఆ విషయం తెలియగానే ఆమె ఆనందంతో నవ్వేసింది. అయితే ఆ నవ్వు చూసిన వారంతా… ఆమె ఆనందాన్ని కెమెరాల్లో బంధించారు. అయితే ఈ ఫొటోలను ఐఏఎస్ అధికారి అవనీష్ శరణ్ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ లో అప్ లోడ్ చేశారు. వయసుతో సంబంధం లేదని.. చదువుకోవాలనే కోరిక ఉంటే ఎప్పుడైనా చదువుకోవచ్చని కుట్టియమ్మ చెబుతోంది.