Dangerous Snake Video : వామ్మో పాములు.. ఈ వీడియో చూస్తే వణికిపోవాల్సిందే!

అందుకు సంబంధించిన వీడియోలను తన యూట్యూబ్ ఛఆనల్ ద్వారా కూడా షేర్ చేస్తుంటాడు. అయితే అతను తాజాగా చేసిన ఓ వీడియో నెట్టింట ప్రస్తుతం వైరల్ గా మారింది.

Dangerous Snake Video : మురళీ వాలే హౌస్లే.. జంతు ప్రేమికులకు సుపరిచితమైన పేరు. ఉత్తర ప్రదేశ్ లోని జౌన్ పూర్ జిల్లాకు చెందిన ఇతనికి డేరింగ్ స్నేక్ క్యాచర్ గా గొప్ప పేరు ఉంది. ఎంత పెద్ద విషపు పామునైనా సరే చాలా సులువుగా పట్టుకుంటాడు. అందుకు సంబంధించిన వీడియోలను తన యూట్యూబ్ ఛఆనల్ ద్వారా కూడా షేర్ చేస్తుంటాడు. అయితే అతను తాజాగా చేసిన ఓ వీడియో నెట్టింట ప్రస్తుతం వైరల్ గా మారింది. అయితే అదేంటో మనమూ ఓసారి చూసేద్దాం.

Dangerous Snake Video
Dangerous Snake Video

ఉత్తర ప్రదేశ్ లోని అంబేడ్కర్ నగర్ జిల్లాలో ఉన్న ఓ గ్రామానికి యూట్యూబర్ మురళీ వెళ్లాడు. అక్కడ పంట పొలాల్లో చాలా కాలంగా ఉన్న విష పాములను చూపించాడు. అంతే కాదండోయ్ ఆ బావి మధ్యలో ఉ్న చెట్టు సాయంతో అందులోకి దిగి విషపూరితమైన ఆరు పాములను పట్టుకున్నాడు. ఇదులో రెండు కోబ్రా, రెండు రక్త పింజర, మరో రెండు ఇతర విషపూరిత పాములు ఉన్నాయి. స్నేక్ క్యాచింగ్ స్టిక్ తో వీటిని సులువుగా పట్టేస్కున్నాడు.

అయితే అతను ఏమాత్రం భయపడకుండా ఆరు పాములను పట్టుకోవడం చూసిన నెటిజెన్లు తెగ ఆశ్చర్యపోతున్నారు. అంతేనా వాటి తల వద్ద గట్టిగా పట్టుకొని వాటి నోరు తెరిచి చూపించాడు. ఇవన్నీ పెద్ద మనషిలా చేసి చూపించిన అతను చివరలో తాను బచ్చానే అని చెప్పడం గమనార్హం. ఇలాంటి పాములను పట్టడంలో తనకంటే పెద్ద వాళ్లు చాలా మందే ఉన్నారని.. అందుకే తనను తాను బచ్చాగా చెప్పుకుంటున్నట్లు వివరించాడు.

Advertisement

Read Also : Nagababu Warning : చిరు, పవన్ కల్యాణ్‌లను ఏమైనా అంటే తాటా తీస్తానంటున్న నాగబాబు!

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel