Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

Intinti Gruhalakshmi july 7 Today Episode : తులసి మీద కోపంతో రగిలిపోతున్న లాస్య.. ఆనందంలో తులసి కుటుంబం ..?

Intinti Gruhalakshmi july 7 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎప

By Ramesh Babu

Published on: July 7, 2022 11:51 AM

Updated on: July 7, 2022 12:37 PM

Intinti Gruhalakshmi july 7 Today Episode

---Advertisement---

Intinti Gruhalakshmi july 7 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్లో తులసి పాట పాడి ప్రేమ్ ను సింగింగ్ కాంపిటీషన్ కు వెళ్తాను అనే విధంగా చేస్తుంది.

ఈరోజు ఎపిసోడ్ లో భాగ్య లాస్యతో మాట్లాడుతూ తులసి గురించి గొప్పగా పొగుడుతూ ఉంటుంది. బావగారు నేను దగ్గరికి చీర తీశారు కాబట్టి సరిపోయింది అదే లేకపోయింది నీ పరిస్థితి ఏమై ఉండేది అంటూ లాస్యను మరింత దెప్పిపొడుస్తుంది. అయినా తులసి అక్క మామూలుది కాదు మనిద్దరితో ఒక ఆట ఆడుకుంది అని అంటూ ఉండగా లాస్య మాత్రం చిరాకు పడుతూ ఉంటుంది.

Advertisement
Intinti Gruhalakshmi july 7 Today Episode
Intinti Gruhalakshmi july 7 Today Episode

కానీ భాగ్య మాత్రం తులసి గురించి మరింత గొప్పగా పొగుడుతుంది. అంతేకాకుండా తులసి అక్క మాజీ మొగుడిని మల్లి మొగుడిని చేసుకున్నా చేసుకుంటుంది అనడంతో వెంటనే లాస్య కోపంతో రగిలిపోతూ ఊరుకునేది లేదు తనకు మరింత అవమానం జరిగే విధంగా చేస్తాను అంటుంది. మరొకవైపు అంకిత డాక్టర్ గా డ్యూటీ కి వెళ్లడానికి రెడీ అవుతుంది.

అప్పుడు తులసి ఈ విషయాన్ని అభి కి చెప్పావా అని అనగా లేదు ఆంటీ అభి స్వార్థపరుడు అంతేకానీ అభిని దూరం చేసుకోవద్దు అని సలహా ఇస్తుంది. ఆ తర్వాత అనసూయ కోసం ఒక కొరియర్ వస్తుంది. అందులో ఒక లెటర్ ఉండగా ఆ లెటర్లో అనసూయ అభిమాని మీరు చెప్పిన కాకరకాయ హల్వా ట్రై చేసి తిన్నాము ఆ దెబ్బతో ఇంటిల్లిపాది ఆసుపత్రిలో పడ్డాము మళ్ళీ ఇలాంటి వీడియోలు చేయకు అనడంతో అందరూ ఒక్కసారిగా నవ్వుకుంటారు.

Intinti Gruhalakshmi : తులసి మీద కోపంతో రగిలిపోతున్న లాస్య..

ఇక అంకిత కోసం అభి హాస్పిటల్ లో ఎదురుచూస్తూ ఉంటాడు. ఇప్పుడు అభి ఇంత చిన్న హాస్పిటల్ లో ఎందుకు జాయిన్ అయ్యావు అని అడుగుతాడు. ఎందుకు ఫోన్ చేసి రమ్మన్నావు అంటూ లోపల ప్రేమ పెట్టుకొని ఎందుకు దూరంగా ఉంటున్నావు అని అభి అనడంతో దూరంగా ఉన్నది నేను కాదు నువ్వు అంటూ కోపంగా మాట్లాడుతుంది అంకిత.

అప్పుడు అభి తులసి మీద లేనిపోని నిందలు వేయడంతో వెంటనే అంకిత తల్లి మనస్సు అర్థం చేసుకోని వాడు కొడుకే కాదు అంటూ స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇస్తుంది. అప్పుడు అవి కూడా ఏ మాత్రం తగ్గకుండా తులసి గురించి నోటికొచ్చిన విధంగా వాగుతాడు. దీనితో అభి, అంకితల మధ్య మరింత దూరం పెరుగుతుంది.

Advertisement

మరొకవైపు ప్రేమ్ సహనం తెచ్చుకుని పాటలు పాడాలి అని ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయేసరికి బాధపడుతూ ఉంటాడు. ఇక రేపటి ఎపిసోడ్ లో ప్రేమ్ కోసం వెళ్ళి తులసి ప్రేమ్ ను దగ్గర తీసుకుంటుంది. అప్పుడు తులసి ప్రేమ్ ఇద్దరు ఎమోషనల్ అవుతూ కనిపిస్తారు. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.

Read Also : Intinti Gruhalakshmi July 6 Today Episode : గాయత్రీకి గట్టిగా బుద్ధి చెప్పిన అంకిత.. సింగింగ్ కాంపిటీషన్ లో పాల్గొంటాను అంటున్న ప్రేమ్..?

, , , , ,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.