Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

Intinti Gruhalakshmi: హనీ నీ ఇంటికి తెచ్చుకోవాలి అనుకుంటున్న తులసి..అసలు నిజం తెలుసుకున్న లాస్య..?

Intinti Gruhalakshmi: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం

By Ramesh Babu

Published on: September 20, 2022 10:00 AM

Updated on: September 20, 2022 10:00 AM

---Advertisement---

Intinti Gruhalakshmi: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్లో సామ్రాట్, హనీ పరిస్థితి చూసి కుమిలిపోతూ ఉంటాడు.

ఈరోజు ఎపిసోడ్ లో నందు హని ని చూసి బాధపడుతూ నేను ఇంత దుర్మార్గపు పని ఎలా చేశాను అని బాధపడుతూ ఉండగా ఇంతలోనే లాస్య అక్కడికి వచ్చి నేను రాత్రి నువ్వు ఎక్కడికి వెళ్లావు లేటుగా వచ్చావు కదా అని అడుగుతుంది. అప్పుడు నందు తాగాలనిపించింది తాగాను అని అనడంతో ఎందుకు తాగావు అని నిలదీస్తుంది.

Advertisement

Lasya confronts Nandu about his evil plan in todays intinti gruhalakshmi serial episode

అప్పుడు లాస్య అడిగిన మాటలకు నందు సమాధానం చెప్పకపోవడంతో లాస్య పదేపదే ఆ విషయం గురించి అడుగుతూ ఉంటుంది. అప్పుడు నందు కోపంగా విసుక్కుంటూ చెప్పాను కదా ఆశ ఎక్కడికి వెళ్లలేదు అని అంటాడు. ఇంతలోనే లాస్య నందు ఫ్యాంట్ తీసుకొని వచ్చి దానిపై గ్రీసు మరకలు ఎందుకు ఉన్నాయి అని అడుగుతుంది. అప్పుడు సామ్రాట్ కారు బ్రేకులు పీకేస్తే వచ్చాయా మందు మత్తులో తెలియకుండా చేశాను లాస్య అని అంటాడు నందు.

ఎందుకు నువ్వు ఇలా ఆలోచించావు నందు ఒక మనిషిని చంపడం ఏంటి అంటూ కోప్పడుతుంది లాస్య. అప్పుడు ఈ విషయం నీకు కాకుండా ఇంకెవరికైనా తెలుసా అని అనగా మెకానిక్ కి తెలుసు వాడు చేయమంటే చేయను అన్నాడు అందుకే నేను చేశాను నందు చెప్పగా వెంటనే వెళ్లి వాడిని ఆపాలి లేకపోతే సామ్రాట్ గారికి తెలిస్తే ఇంకా అంతే సంగతులు అని అంటుంది లాస్య.

మరొకవైపు అని ఒంటరిగా కూర్చుని ఉండగా అప్పుడు వంట మనిషి తినమని అనడంతో నాకు నిద్ర వస్తుంది ఆకలిగా లేదు అని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది హనీ. అప్పుడు సామ్రాట్ బాధపడుతూ ఉండగా ఇంతలోనే అక్కడికి సామ్రాట్ వాళ్ళ బాబాయ్ అక్కడికి వస్తారు. అప్పుడు కార్ యాక్సిడెంట్ గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అవుతూ ఉంటాడు సామ్రాట్.

Advertisement

అప్పుడు సామ్రాట్ వాళ్ళ బాబాయ్ నువ్వు హనీకి కావాల్సిందల్లా తీసుకు రాగలవు కాలు కింద పెట్టుకోకుండా చూసుకోగలవు కానీ తల్లి ప్రేమను పంచలేవు అని అంటాడు. అవును బాబాయ్ ఈ ఇంట్లో పుట్టినందుకు హనీ ఈ బాధను అనుభవించాల్సి వస్తోంది అని బాధపడుతూ ఉంటాడు. మరొకవైపు తులసి జరిగిన విషయాలు తలుచుకొని బాధపడుతూ ఉంటుంది. అప్పుడు ఇంట్లో అందరూ తులసిని ఓదారుస్తూ ఉంటారు.

ఇలాంటి సమయంలో హనీ ఒకటే ఎలా ఉంటుందో అని బాధపడుతూ ఉండగా వెంటనే అభి చూసుకోవడానికి చాలామంది పనివాళ్ళు ఉన్నారు నువ్వు బాధ పడాల్సిన అవసరం లేదు అని అంటాడు. అప్పుడు ఇంట్లో వాళ్ళందరూ కూడా అభిని తిడతారు. ఇప్పుడు పరంధామయ్య నాకు ఆలోచన వచ్చింది ఇక్కడే హనీ ని ఉంచుకుందాము అనడంతో ఆలోచన బాగానే ఉంది కానీ సామ్రాట్ గారు ఒప్పుకుంటారో లేదో అని అంటుంది తులసి.

మరొకవైపు లక్కీ స్కూల్ కి బయలుదేరుతూ ఉండగా అప్పుడు లాస్య అని లక్కీ అమ్మ హనీ కి యాక్సిడెంట్ అయింది కదా అని అనగా నీకు ఎవరు చెప్పారు అని లాస్య అడగడంతో స్కూల్లో అందరూ మాట్లాడుకుంటున్నారు అని అంటాడు. అప్పుడు నందు అయినా నీకు హనీతో స్నేహమేంటి అని అనడంతో బాగోలేనప్పుడు వెళ్లి పలకరించడం మర్యాద అని అంటాడు లక్కీ. అప్పుడు నందు లక్కీ పైన సీరియస్ అవుతాడు.

అప్పుడు లక్కీ నీ బట్టలు మార్చుకొని రా అక్కడికి వెళ్దాము అని అనడంతో నందు ఇప్పుడు అక్కడికి వెళ్లడం అవసరమా అని అనడంతో మన ఉద్యోగాలకి చాలా సహాయం అవుతుంది వెళ్దాం అని అంటుంది లాస్య. ఆ తర్వాత తులసి పాయసం చేస్తూ ఉండగా శృతి దివ్య ఇద్దరూ పొగుడుతూ ఉంటారు. ఆ తర్వాత పరంధామయ్య దంపతులు ఆ పాయసం తినడం కోసం ప్లాన్ వేసి ఒక పాప ఏడుస్తున్నట్లుగా మొబైల్ ఫోన్లో రింగ్టోన్ పెట్టి అందరూ ఎవరు ఏడుస్తున్నారు అని వెతుకుతూ ఉండగా వీళ్ళిద్దరూ దొంగగా వెళ్లి ఆ పాయసాన్ని తింటూ ఉంటారు. అది చూసి అందరూ నవ్వుకుంటారు.

, , , , , ,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.