వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

Karthika Deepam: ఇంటికి చేరుకున్న హిమ.. ఇంట్లోకి రావద్దు అంటున్న సౌర్య..?

Karthika Deepam: తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.. హిమ రెస్టారెంట్ లో కూర్చుని తింటూ వుంటుంది. అలాగే బయటకు వెళ్లిన ఇంద్రమ్మ దంపతులు ఎంత సేపటికీ తిరిగి రాలేదు అని వారి కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇక మరొకవైపు సౌందర్య కూతురిని అల్లుడిని కలపడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. కానీ స్వప్న మాత్రం సౌందర్య ... Read more

By Ramesh Babu

Published on: March 18, 2022 8:50 AM

Updated on: March 18, 2022 8:50 AM

---Advertisement---

Karthika Deepam: తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..

హిమ రెస్టారెంట్ లో కూర్చుని తింటూ వుంటుంది. అలాగే బయటకు వెళ్లిన ఇంద్రమ్మ దంపతులు ఎంత సేపటికీ తిరిగి రాలేదు అని వారి కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇక మరొకవైపు సౌందర్య కూతురిని అల్లుడిని కలపడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది.

కానీ స్వప్న మాత్రం సౌందర్య మాట వినదు. నా లైఫ్ నా ఇష్టం మమ్మీ అని అంటుంది. అల్లుడు సౌందర్య ని అత్తయ్య అని పిలువగానే నాకు దీప గుర్తుకొస్తుంది అని ఏడుస్తుంది సౌందర్య. బాగా ఉన్న మన కుటుంబానికి ఎవరు శాపం తగిలింది ఏమో తెలియదు కానీ కుటుంబం చిన్న భిన్నం అయిపోయింది.

కార్తీక్, దీప లు ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు అంటూ సౌందర్య బాధపడుతుంది. మరొకవైపు ఆదిత్య, శ్రావ్య అమెరికా వెళ్ళిపోతాను అని అంటున్నారు. కనీసం మీరు అయినా కలిసి ఉండి అందరు కలిసి ఉందాం అని సౌందర్య అనగా స్వప్న సీరియస్ అవుతుంది.

నాకు ఎటువంటి బంధాలు బంధుత్వాలు వద్దు ఇక్కడినుంచి వెళ్లిపోండి అని చెబుతుంది. స్వప్న అలా మాట్లాడిన దానికి సౌందర్య అల్లుడు క్షమాపణలు చెబుతుంది. ఇంతలో స్వప్న పిల్లలు రాగా వాళ్లను చూసి సౌందర్య ఎమోషనల్ అవుతూ తన ఇంటికి పిలుచుకొని వెళ్ళాలి అని బయలుదేరుతుంది.

మరొకవైపు ఇంద్రమ్మ దంపతులు డబ్బులు దొంగలిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. పోలీసులు వారిని అరెస్టు చేశారు. ఇక హిమ వాళ్లకోసం రెస్టారెంట్ లో ఎదురుచూస్తుండగా అక్కడే ఉన్న వెయిటర్ ఈ బిల్లు నేను కట్టుకుంటాను అని చెప్పి పంపిస్తాడు.హిమ దారిలో నడుచుకుంటూ వెళ్తుండగా స్వప్న కొడుకు చూస్తాడు. సౌందర్య కారు ఆపి హిమ దగ్గరికి వెళుతుంది.

హిమ రోడ్డుపై వెళ్తున్నప్పుడు వెనకనుంచి ఆటో వచ్చి యాక్సిడెంట్ చేసే సమయానికి సౌందర్య కాపాడుతుంది. అప్పుడు హిమ ను ప్రేమగా హత్తుకుని ఇంటికి తీసుకుని వెళుతుంది. సౌందర్య ఎలా చూసినా ఆనందరావు, ఆదిత్య, శ్రావ్య ఎమోషనల్ అవుతారు. సౌర్య మాత్రం నువ్వు ఇంటికి రావద్దు అని అంటుంది. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.

, , , ,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

Join our WhatsApp Channel