Vivo Y400 5G : కొత్త వివో ఫోన్ కోసం చూస్తున్నారా? భారత మార్కెట్లో వివో నుంచి Y400 5G ఫోన్ వచ్చేసింది. వివో Y400 ప్రో తర్వాత చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు వివో Y400 5Gని అధికారికంగా లాంచ్ చేసింది. ఈ వివో ఫోన్ 6000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్, స్నాప్‌డ్రాగన్ 4 Gen 2 చిప్‌సెట్, IP68, IP69-రేటెడ్ వాటర్ రెసిస్టెన్స్‌ను కలిగి ఉంది.
ఈ వివో ఫోన్ Amazon, Flipkart, Vivo e-store ఇతర ఛానెల్స్ వంటి ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ తడి చేతి ఆపరేషన్, తేమ డిటెక్షన్, నీటి అడుగున ఫోటోగ్రఫీకి సపోర్టు ఇస్తుందని వివో పేర్కొంది. వివో Y400 5G ధర, స్పెసిఫికేషన్లు, ఫీచర్లతో వస్తుంది.
Vivo Y400 5G స్పెసిఫికేషన్లు :
వివో Y400 5G ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల FHD+ అమోల్డ్ ప్యానెల్‌తో వస్తుంది. 1,800 నిట్‌ల గరిష్ట బ్రైట్‌నెస్‌కు సపోర్టు ఇస్తుంది. హుడ్ కింద 8GB వరకు ర్యామ్ LPDDR4X, 256GB వరకు UFS 3.1 స్టోరేజీతో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 SoC నుంచి పవర్ పొందుతుంది.
ఈ వివో ఫోన్ 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,000mAh బ్యాటరీతో వస్తుంది. ఆండ్రాయిడ్ ఆధారిత FunTouch OS 15పై రన్ అవుతుంది. కెమెరా విషయానికొస్తే.. ఇందులో 50MP సోనీ IMX852 ప్రైమరీ షూటర్, 2MP సెకండరీ కెమెరా ఉన్నాయి. 32MP సెల్ఫీ కెమెరా కూడా ఉంది.
Vivo Y400 5G AI ఫీచర్లు :
ఈ వివో ఫోన్ AI డాక్యుమెంట్ క్యాప్చర్, స్క్రీన్ ట్రాన్స్‌లేషన్, సర్కిల్ టు సెర్చ్, ఆడియో ట్రాన్స్‌క్రిప్షన్‌ల కోసం AI ట్రాన్స్‌క్రిప్ట్ అసిస్ట్, ఆటో సమ్మరీస్, ట్రాన్సులేషన్ కోసం AI నోట్ అసిస్ట్, లో సిగ్నల్ ఉన్న ప్రాంతాలలో కనెక్టివిటీకి కోసం AI సూపర్‌లింక్ వంటి అనేక AI ఫీచర్లతో వస్తుంది.
భారత్‌లో వివో Y400 5G ధర ఎంతంటే? :
వివో Y400 5G ఫోన్ 8GB + 128GB వేరియంట్ ధర రూ. 21,999, 8GB + 256GB వేరియంట్ ధర రూ. 23,999కు పొందవచ్చు. ఈ వివో ఫోన్ ప్రీ-బుకింగ్ కోసం అందుబాటులో ఉంది. ఆగస్టు 7, 2025 నుంచి అమ్మకానికి ఉంటుంది. కస్టమర్లు 10 శాతం వరకు తగ్గింపు పొందవచ్చు. ఈ వివో ఫోన్ TWS 3e ANC ఇయర్‌ఫోన్‌లతో రూ. 1,499కి లభిస్తుంది.