Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Summer AC Tips : ఎండలు బాబోయ్.. AC ఆన్ చేసే ముందు జాగ్రత్త.. మీ విద్యుత్ ఆదా చేసే పవర్‌ఫుల్ టిప్స్.. !

Summer AC Tips : ఏదైనా ఏసీని కొనుగోలు చేసే ముందు ఈ సూచనలను పరిగణనలోకి తీసుకోవాలి. మీకోసం 4 సులభమైన టిప్స్ తెలియజేస్తున్నాం.

By Vinod Kumar

Published on: April 7, 2025 8:58 PM

Updated on: June 23, 2025 9:03 PM

Summer ac tips and tricks

---Advertisement---

Summer AC Tips : వేసవి కాలంలో విద్యుత్ బిల్లులు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి పరిస్థితిలో, మీరు విద్యుత్ బిల్లు ఆదా చేయాలని ఆలోచిస్తుంటే.. కొన్ని (Summer AC Tips) అద్భుతమైన టిప్స్ పాటించండి. ఈ టిప్స్ పాటించడం ద్వారా విద్యుత్ బిల్లులను ఆదా చేసుకోవచ్చు. మీరు చేయాల్సిందిల్లా.. ఏదైనా ఏసీని కొనుగోలు చేసే ముందు ఈ సూచనలను పరిగణనలోకి తీసుకోవాలి. మీకోసం 4 సులభమైన టిప్స్ తెలియజేస్తున్నాం. మీ విద్యుత్ బిల్లు ఆదాకు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి.

ఏసీని కొనే ముందు ఈ విషయాలను గుర్తుంచుకోండి :
ఇంటికి ఏదైనా డివైజ్ లేదా ఏసీ కొనుగోలు చేసే ముందు మీరు చాలా విషయాలను జాగ్రత్తగా చూసుకోవాలి. విద్యుత్ మంత్రిత్వ శాఖ సూచనల ప్రకారం.. మీరు ముందుగా డివైజ్ రేటింగ్‌లను చెక్ చేయాలి. AC కొనేటప్పుడు మీరు 5 స్టార్ ఏసీలపై దృష్టి పెట్టాలి. 5 స్టోర్ రేటింగ్ కారణంగా మీ ఇంటి విద్యుత్ బిల్లు గణనీయంగా ఆదా అవుతుంది. ఇలా చేయడం ద్వారా దాదాపు 15 శాతం విద్యుత్ ఆదా చేయవచ్చని ఏసీ కంపెనీలు చెబుతున్నాయి.

(Summer AC Tips) బల్బ్ లేదా ట్యూబ్ లైట్ ఆప్షన్ :

ఇంట్లో లైటింగ్ కోసం బల్బులు లేదా ట్యూబ్‌లైట్‌లను ఉపయోగించే ముందు మీరు దీన్ని కూడా గుర్తుంచుకోవాలి. ప్రభుత్వ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న డేటా ప్రకారం.. బల్బులు ఎక్కువ విద్యుత్తును వినియోగిస్తాయి. ఇలాంటి పరిస్థితిలో మీరు LED బల్బును ఉపయోగించవచ్చు.

విద్యుత్తును ఆదా చేయడంలో కూడా చాలా సాయపడతాయి. ఈ పద్ధతులు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఇంటికి ఫ్యాన్ ఎంచుకునే ముందు కూడా మీరు శ్రద్ధ వహించాలి. ఇప్పుడు BLDC టెక్నాలజీ వస్తోంది. విద్యుత్ ఆదాకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

సౌరశక్తి వినియోగం :

సౌర వ్యవస్థను కూడా ఉపయోగించవచ్చు. ఈ వ్యవస్థ చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. సౌరశక్తి సాయంతో విద్యుత్తును ఆదా చేసుకోవచ్చు. ఎందుకంటే.. సూర్యకాంతి సాయంతో ఛార్జ్ అవుతుంది. సౌరశక్తి సెటప్‌ను అమర్చాలి. అంత తేలికగా జరగదు. కానీ, ఈ వ్యవస్థ అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే.. విద్యుత్తును ఆదా చేస్తుంది. మీరు ఈ శక్తిని ఏ ఎలక్ట్రానిక్ పరికరానికైనా ఉపయోగించవచ్చు.

Read Also : Poco C71 Launch : పోకో కొత్త C71 ఫోన్ కిర్రాక్.. ధర తక్కువ.. ఫీచర్లు ఎక్కువ..!

ఏసీని 24 డిగ్రీల వద్ద నడపండి :
వేసవిలో AC ఉష్ణోగ్రతను స్థిరంగా ఉంచడం Summer AC Tips కూడా ముఖ్యం. మీరు టెంపరేచర్ మార్చుకుంటే.. అది విద్యుత్ వినియోగాన్ని నేరుగా ప్రభావితం చేస్తుంది. ఇలాంటి పరిస్థితిలో, మీరు ఏసీని 24 డిగ్రీల సెల్సియస్ వరకు మాత్రమే నడపడం చాలా ముఖ్యం.

లేదంటే విద్యుత్ వినియోగం కూడా పెరుగుతుంది. మీరు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. ప్రభుత్వ సైట్ ప్రకారం.. మీరు 24 డిగ్రీల సెల్సియస్ వరకు మాత్రమే ఏసీని ఉపయోగించాలి. ఈ ఉష్ణోగ్రత వద్ద AC వినియోగంతో మీ విద్యుత్ ఆదా అవుతుంది.

, , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

RELEATED POSTS :

PM Modi Video : ‘ఫ్రెండ్‌షిప్ డే’ను గుర్తు చేస్తూ ప్రధాని మోదీ మరో వీడియో.. ఆగస్టు 7న ప్రతి ఒక్కరూ ఇలా చేయాలని పిలుపు!

PM Modi Video : ‘ఫ్రెండ్‌షిప్ డే’ను గుర్తు చేస్తూ ప్రధాని మోదీ మరో వీడియో.. ఆగస్టు 7న ప్రతి ఒక్కరూ ఇలా చేయాలని పిలుపు!

Bangaram Song : డీమాన్ పవన్-రీతూ చౌదరి ‘బంగారం’ సాంగ్ చూశారా? యూట్యూబ్‌లో ట్రెండింగ్.. కెమిస్ట్రీ అదిరిపోయింది!

Bangaram Song : డీమాన్ పవన్-రీతూ చౌదరి ‘బంగారం’ సాంగ్ చూశారా? యూట్యూబ్‌లో ట్రెండింగ్.. కెమిస్ట్రీ అదిరిపోయింది!

Telangana Jowar Farmers : తెలంగాణ రైతులకు బిగ్ రిలీఫ్.. అకౌంట్లలో డబ్బులు పడ్డాయ్.. ఇప్పుడే ఇలా చెక్ చేస్కోండి..!

Telangana Jowar Farmers : తెలంగాణ రైతులకు బిగ్ రిలీఫ్.. అకౌంట్లలో డబ్బులు పడ్డాయ్.. ఇప్పుడే ఇలా చెక్ చేస్కోండి..!

Amazon Great Freedom Sale : అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ 2026 : వన్‌ప్లస్ 15పై భారీ డీల్.. కొనాలనుకునేవారికి ఇదే గోల్డెన్ ఛాన్స్!

Amazon Great Freedom Sale : అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ 2026 : వన్‌ప్లస్ 15పై భారీ డీల్.. కొనాలనుకునేవారికి ఇదే గోల్డెన్ ఛాన్స్!

Gold Price Today : బంగారం ప్రియులకే పండగే.. భారీగా దిగొచ్చిన గోల్డ్ రేట్లు.. ఇప్పుడే కొనడం బెస్ట్!

Gold Price Today : బంగారం ప్రియులకే పండగే.. భారీగా దిగొచ్చిన గోల్డ్ రేట్లు.. ఇప్పుడే కొనడం బెస్ట్!

Hyderabad Metro : రోజూ హైదరాబాద్ మెట్రోలో ప్రయాణిస్తున్నారా? త్వరలో మంత్లీ, క్వార్టర్లీ పాస్‌లు.. విద్యార్థులు, ఉద్యోగులకు భారీ ఊరట!

Hyderabad Metro : రోజూ హైదరాబాద్ మెట్రోలో ప్రయాణిస్తున్నారా? త్వరలో మంత్లీ, క్వార్టర్లీ పాస్‌లు.. విద్యార్థులు, ఉద్యోగులకు భారీ ఊరట!