Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Reliance Jio : జియో చౌకైన ధరకే కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లు.. హైస్పీడ్ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, ఫ్రీగా JioTV కూడా

Reliance Jio

Reliance Jio

Reliance Jio : రిలయన్స్ జియో అనేక రీఛార్జ్ ప్లాన్లను అందిస్తోంది. తక్కువ ధరలో ప్లాన్ల కోసం చూస్తుంటే ఇదే బెస్ట్ టైమ్. జియో ఫోన్ ప్రీపెయిడ్ ప్లాన్లు రూ. 200 లోపు అందుబాటులో ఉన్నాయి. ఈ ప్లాన్లలో జియో ఫోన్ డేటా యాడ్-ఆన్ ప్యాక్‌లు కూడా ఉన్నాయి. జియో ఫోన్ ఈ రీఛార్జ్ ప్లాన్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

రూ. 186కే జియో ప్లాన్ :
ఈ రీఛార్జ్ ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. రోజుకు 1GB డేటా లభిస్తుంది. ఈ ప్లాన్‌లో కంపెనీ జియో టీవీకి ఫ్రీ యాక్సెస్‌ను అందిస్తోంది.

Reliance Jio : రూ. 182కే జియో ఫోన్ ప్లాన్ :

జియో ఫోన్ డేటా యాడ్-ఆన్ ప్యాక్. ఇందులో కంపెనీ ఇంటర్నెట్‌ను ఉపయోగించి ప్రతిరోజూ వినియోగదారులకు 2GB డేటాను ఇస్తుంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు ఉంటుంది.

Advertisement

Read Also : Vivo T4 5G : ఈ వివో స్మార్ట్‌ఫోన్‌‌పై అద్భుతమైన డిస్కౌంట్.. క్రేజీ ఆఫర్లు, ధర ఎంతో తెలిస్తే కొనేస్తారంతే!

రూ. 152కే జియో ప్లాన్ :
ఈ జియో ఫోన్ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు. ఇందులో కంపెనీ ప్రతిరోజూ 0.5 GB డేటాను అందిస్తోంది. ఈ ప్లాన్‌లో మీకు అన్‌లిమిటెడ్ కాలింగ్ కూడా అందిస్తోంది. ఈ ప్లాన్‌లో జియో టీవీకి కూడా యాక్సెస్ పొందవచ్చు.

Reliance Jio : రూ. 125కే జియో ప్లాన్ :

ఈ ప్లాన్ వ్యాలిడిటీ 23 రోజులు. మీరు రోజుకు 0.5GB డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్ అన్‌లిమిటెడ్ కాలింగ్‌తో వస్తుంది. మీరు Jio TVకి కూడా యాక్సెస్ పొందవచ్చు.

Advertisement

రూ. 122కే జియో ప్లాన్ :
ఈ జియో ప్లాన్ కింద డేటా యాడ్-ఆన్ ప్యాక్. వ్యాలిడిటీ 28 రోజులు. ఈ ప్లాన్‌లో జియో ప్రతిరోజూ 1GB డేటాను అందిస్తోంది.

రూ. 91కే జియో ఫోన్ ప్లాన్ :

ఈ ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఇందులో రోజుకు 0.1 GB డేటా పొందవచ్చు. మీకు 200MB అదనపు డేటా కూడా లభిస్తుంది. 50 ఉచిత SMS, అన్‌లిమిటెడ్ కాలింగ్ కూడా ఈ ప్లాన్‌లో పొందవచ్చు.

Advertisement
Exit mobile version