Electric Car Deals : ఈ 4 ఎలక్ట్రిక్ కార్లపై రూ. 10 లక్షలకు పైగా తగ్గింపు.. ఇలాంటి డిస్కౌంట్లు మళ్లీ రావు భయ్యా.. కొనేసుకోండి!

Updated on: August 8, 2025

Top 4 Electric Car Deals : కొత్త ఎలక్ట్రిక్ కారు కోసం చూస్తున్నారా? మీరు ఎలక్ట్రిక్ కార్ల అభిమాని అయితే ఇది మీకోసమే.. టాటా, కియా, ఎంజీ వంటి బ్రాండ్లతో సహా అనేక ఆటో కంపెనీలు తమ ఎలక్ట్రిక్ కార్లపై భారీ డిస్కౌంట్లను అందిస్తున్నాయి. జూలై 2025లో భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్ల అమ్మకంలో రికార్డు స్థాయిలో 93శాతం వృద్ధి నమోదైంది. అయినప్పటికీ, ఈ ఆఫర్ల ద్వారా అమ్మకాలను మరింత వేగంగా పెంచడమే ఆటో కంపెనీల లక్ష్యంగా కనిపిస్తోంది. మీరు కూడా కొత్త ఎలక్ట్రిక్ కార్లను కొనేందుకు చూస్తుంటే ఈ అద్భుతమైన డిస్కౌంట్లను అసలు వదులుకోవద్దు..

Electric Car Deals : టాటా ఎలక్ట్రిక్ కార్లపై రూ. లక్ష వరకు డిస్కౌంట్ :

టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ కార్లపై అద్భుతమైన డీల్స్ ప్రకటించింది. టియాగో ఎలక్ట్రిక్ కార్లు, పంచ్ ఎలక్ట్రిక్ కార్లు, నెక్సాన్ ఎలక్ట్రిక్ కార్లు, కర్వ్ ఎలక్ట్రిక్ కార్లపై వినియోగదారులు రూ.40వేల నుంచి రూ.1 లక్ష వరకు బెనిఫిట్స్ పొందవచ్చు.

Read Also : Harley-Davidson : ఇలాంటి బైకులు కొనాలి భయ్యా.. హార్లే-డేవిడ్సన్ బైక్‌లపై భారీ డిస్కౌంట్లు.. ఫీచర్లు, లుక్స్ కేక!

Advertisement

ప్రస్తుతం కంపెనీ కొత్త హారియర్ ఎలక్ట్రిక్ కార్లపై కూడా లాయల్టీ బోనస్‌ను అందిస్తోంది. టియాగో ఎలక్ట్రిక్ కార్లు వంటి మోడళ్లపై క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్, అనేక ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా అడ్వాన్స్ ఫీచర్లతో కూడిన ఎలక్ట్రిక్ కారును సరసమైన ధరకు కొనుగోలు చేయొచ్చు.

సిట్రోయెన్ eC3పై రూ.1.25 లక్షల డిస్కౌంట్ :

సిట్రోయెన్ eC3 అనేది కాంపాక్ట్, స్టైలిష్ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ కారు. కంపెనీ రూ.1.25 లక్షల వరకు డిస్కౌంట్ అందిస్తోంది. ఈ ఆఫర్ అన్ని (Citroen electric car deals) వేరియంట్లపై వర్తిస్తుంది. సిట్రోయెన్ eC3 ఎక్స్-షోరూమ్ ధర రూ.12.90 లక్షల నుంచి రూ.13.53 లక్షల వరకు అమ్ముడవుతోంది.

Top 4 Electric Car Deals in India
Top 4 Electric Car Deals in India

Electric Car Deals : మహీంద్రా XUV400పై రూ.3 లక్షల వరకు డిస్కౌంట్ :

మహీంద్రా పాపులర్ ఎలక్ట్రిక్ SUV XUV400పై రూ.3 లక్షల వరకు డిస్కౌంట్ అందిస్తోంది. ఈ డిస్కౌంట్ మహీంద్రా MY2024 స్టాక్‌పై అందుబాటులో ఉంది. మహీంద్రా XUV400 ఎక్స్-షోరూమ్ ధర రూ.15.49 లక్షల నుంచి ప్రారంభమై రూ.17.69 లక్షల వరకు ఉంటుంది. ఈ SUV పర్ఫార్మెన్స్, లాంగ్ రేంజ్ పాపులర్ EC Pro, EL Pro అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది.

Advertisement

కియా EV6 ఫేస్‌లిఫ్ట్‌పై రూ.10 లక్షలకు పైగా తగ్గింపు:

కియా ప్రీమియం ఎలక్ట్రిక్ SUV EV6 ఫేస్‌లిఫ్ట్‌ను మార్చి 2025లో రూ.65.90 లక్షల ప్రారంభ ధరకు లాంచ్ చేసింది. ఇప్పుడు కంపెనీ ఈ కియా EVపై రూ.10 లక్షల కన్నా భారీ డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఇందులో స్పెషాలిటీ ఏమిటంటే.. ఈ ఆఫర్ పాత స్టాక్‌పై మాత్రమే కాకుండా కొత్త ఫేస్‌లిఫ్ట్ మోడల్‌పై కూడా పొందవచ్చు. ఈ ప్యాకేజీలో క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ ఆఫర్ ఉన్నాయి. కియా EV6 ఇప్పుడు గతంలో కన్నా సరసమైన ధరకే లభిస్తోంది.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel