Rashmika mandanna : ఛలో సినిమాతో తెలుగు సినిమా సినీ రంగంలోకి అడుగు పెట్టిన అందాల తార రష్మిక మందన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతి తక్కువ సమయంలోనే తన అందం, అభినయంతో స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయిన ఆమె ప్రస్తుతం బాలీవుడ్ మీద దృష్టి పెట్టింది. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ సినిమాల్లో అనేక అవకాశాలకు దక్కించుకుంటూ దూసుకుపోతున్న ఈ అమ్మడు… సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్స్ తో పాటు తన ఫొటోలు, వీడియోలను కూడా షేర్ చేస్తుంటుంది. అయితే తాజాగా ఆమె చేసిన ఓ డ్యాన్స్… నెట్టింట తెగ వైరల్ అయింది.
బాడీ మొత్తం షేక్ చేస్తూ ఈమె క్యూట్ గా డ్యాన్స్ చేసింది. నాతో పాటు ఎవరైనా జాయిన్ అవుతారా అంటూ కామెంట్ కూడా చేసింది. రష్మిక డ్యాన్స్ వీడియో నెటిజెన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. అంతేకాక ఆమె వీడియోని తెగ వైరల్ చేస్తున్నారు. ఒక పక్క తెలుగు మరో పక్క తమిళ అలాగే హిందీ సినిమాలు చేస్తూ ఆమె హాట్ టాపిక్ అవుతుంది. ఇప్పిటేక విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న వారసుడు అనే ద్విభాషా చిత్రంలో ఆమె హీరోయిన్ గా నటిస్తోంది.
AdvertisementView this post on Instagram
AdvertisementAdvertisement