Lemon benifits : నిమ్మకాయ. చాలా మందికి ఇష్టమైంది ఇది. జ్యూస్, షర్బత్, పులిహోర.. ఇలా అన్నింట్లలో వాడుతుంటాం. అయితే ఇందులోని గింజలు తప్ప మిగిలిన భాగం అంతా అమృత తుల్యమని నిపుణులు చెబుతున్నారు. ప్రతీ రోజూ ఓ నిమ్మ పండను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల వందేళ్ల వరకు ఎలాంటి అనారోగ్యం కల్గకుండా ఉంటారని వైద్యులు సూచిస్తున్నారు. నిమ్మకాయ పచ్చడిని తింటే కూడా చాలా మంచిదట. అలాగే కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో నిమ్మ కాయ ప్రధాన పాత్ర పోషిస్తుంది. శరీరానికి తక్షణ శక్తి ఇవ్వడంలో దీనికి సాటి ఏది రాదు. రోగ నిరోధకు శక్తి తక్కువ ఉన్న వాళ్లు వీటిని రోజూ తినాలని.. అలా అయితే తక్కువ కాలంలోనే ఆరోగ్యంగా తయారవుతురాని వైద్యులు కూడా చెబుతుంటారు.
అంతే కాదండోయ్ నిమ్మకాయలను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఇన్ ఫెక్షన్ ల బారిన పడే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ప్రతిరోజూ ఉదయం గ్లాసు గోరు వెచ్చని నీటిలో ఒక టేబుల్ స్పూన్ నిమ్మ రసాన్ని వేసి తాగడం వల్ల మూత్ర పిండాల్లో రాళ్లు కరిగిపోతాయని చెబుతుంటారు. అలాగే చర్మంపై మడతలు, మచ్చలు తగ్గించడంలో కూడా ఇవా చాలా బాగా పని చేస్తాయని అంటారు. అందుకే మీరు ప్రతిరోజూ ఓ నిమ్మపండుని తిని.. ఆరోగ్యంగా ఉండండి.
Read Also : Health tips: బెల్లాన్ని ఇలా వాడితే.. మలబద్ధకం, ఊబకాయం వంటి సమస్యలకు చెక్!