PM-KISAN 20th Instalment : పీఎం కిసాన్ 20వ విడత.. రైతుల బ్యాంకు ఖాతాలో ఈరోజు రూ. 2వేలు జమ అవుతాయా?..

Updated on: July 18, 2025

PM-KISAN 20th Instalment : పీఎం కిసాన్ లబ్ధిదారు రైతులంతా 20వ విడత కోసం ఎదురుచూస్తున్నారు. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN 20th Instalment) పథకం కింద 20వ విడతను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జూలై 18న విడుదల చేస్తారా? దీనికి సంబంధించి ఇంకా అధికారిక ధృవీకరణ లేనప్పటికీ, జూలై 18న బిహార్‌లో జరిగే కార్యక్రమంలో ప్రధాని మోదీ 9.8 కోట్లకు పైగా రైతులకు పీఎం కిసాన్ యోజన 20వ విడతను విడుదల చేయవచ్చునని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

పీఎం కిసాన్ 20వ విడత వస్తుందా? :

పీఎం కిసాన్ పథకం 20వ విడత కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది రైతులకు శుక్రవారం (జూలై 18, 2025) వారి బ్యాంకు ఖాతాలో రూ. 2వేలు జమ అవుతుందని మీడియా నివేదికలు తెలిపాయి. అయితే, దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక ధృవీకరణ లేదు.

ప్రధానమంత్రి కిసాన్ 20వ విడత :
బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బిహార్‌లో పర్యటిస్తున్నారు. మీడియా నివేదికల ప్రకారం.. జూలై 18న మోతిహరి (తూర్పు చంపారన్)లో జరిగే భారీ బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగించవచ్చు. జూలై 18న జరిగే ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా 9.8 కోట్లకు పైగా రైతులకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 20వ విడతను ప్రధాని మోదీ విడుదల చేయవచ్చని మీడియాలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Advertisement

PM-KISAN 20th Instalment : పీఎం కిసాన్ ఈ 5 ముఖ్యమైన విషయాలివే :

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ప్రయోజనాల కోసం రైతులు ఈ 5 ముఖ్యమైన విషయాలను తప్పక గుర్తుంచుకోవాలి.
1. మీ బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డుతో లింక్ చేయండి
2. మీ ఆధార్ సీడింగ్‌ను బ్యాంక్ అకౌంట్ స్టేటస్‌తో చెక్ చేయండి
3. మీ ఆధార్ సీడెడ్ బ్యాంక్ అకౌంటులో మీ DBT ఆప్షన్ యాక్టివ్‌గా ఉంచండి
4. మీ e-KYCని పూర్తి చేయండి
5. పీఎం కిసాన్ పోర్టల్‌లో ‘Know Your Staus’ మాడ్యూల్ కింద ఆధార్ సీడింగ్ స్టేటస్ కూడా చెక్ చేయండి.

Read Also : PM Kisan : రైతులకు బిగ్ అలర్ట్.. పీఎం కిసాన్ 20వ విడత విడుదల తేదీ ఇదిగో.. మీ పేరు ఉందా చెక్ చేసుకోండి..!

పీఎం కిసాన్ 20వ విడత.. లబ్ధిదారుల జాబితాలో మీ పేరును ఎలా చెక్ చేయాలి? :

  • అధికారిక PM కిసాన్ వెబ్‌సైట్ (https://pmkisan.gov.in/) పోర్టల్‌ను విజిట్ చేయండి.
  • “Payment Success” ట్యాబ్ కింద ఇండియా మ్యాప్ చూడొచ్చు.
  • రైట్ సైడ్ “Dashboard” అనే ఎల్లో కలర్ ట్యాబ్ ఉంటుంది.
  • డాష్‌బోర్డ్‌పై క్లిక్ చేయండి.
  • క్లిక్ చేశాక కొత్త పేజీకి రీడైరెక్ట్ అవుతారు.
  • విలేజ్ డాష్‌బోర్డ్ ట్యాబ్‌లో మీ పూర్తి వివరాలను ఎంటర్ చేయాలి.
  • రాష్ట్రం, జిల్లా, ఉప జిల్లా, గ్రామ పంచాయతీని ఎంచుకోండి.
  • ఆ తర్వాత Show బటన్‌పై క్లిక్ చేయండి.
  • మీ వివరాలను ఎంచుకోవచ్చు.
  • ‘Get Report’ బటన్ క్లిక్ చేయండి
  • మీ పేరును లబ్ధిదారుల జాబితాలో చూడవచ్చు.

PM-KISAN 20th Instalment : పీఎం కిసాన్ 19వ విడత రూ. 22వేల కోట్లు.. :

ఈ ఏడాది ఫిబ్రవరిలో బిహార్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) 19వ విడతను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా 2.41 కోట్ల మంది మహిళా రైతులతో సహా 9.8 కోట్ల మంది రైతులకు పీఎం కిసాన్ పథకం 19వ విడత వాయిదా బదిలీ అయింది. ప్రత్యక్ష ప్రయోజన బదిలీ (DBT) ద్వారా రూ.22వేల కోట్లకు పైగా నేరుగా ఆర్థిక సాయం అందింది.

Advertisement

పీఎం కిసాన్ పథకం అనేది సొంత సాగుభూమిని కలిగి ఉన్న రైతుల ఆర్థిక అవసరాలను తీర్చేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫిబ్రవరి 2019లో ప్రారంభించారు. ఈ పథకం కింద సంవత్సరానికి రూ. 6,000 ఆర్థిక ప్రయోజనాన్ని కేంద్రం అందిస్తోంది. మొత్తం 3 సమాన వాయిదాలలో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) మోడ్ ద్వారా రైతుల ఆధార్ సీడెడ్ బ్యాంక్ అకౌంట్లలో జమ అవుతుంది.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel