Viral Video : వేసవి తాపం… కరెంటు కోతలు.. ఉక్కపోతతో సతమతమవుతున్న ఈ వ్యక్తి చేసిన పని తెలిస్తే నవ్వాపుకోలేరు?

Updated on: May 5, 2022

Viral Video : వేసవి కాలం వచ్చిందంటే ప్రతి ఒక్కరూ ఎంతో చిరాకుగా ఉంటారు. ఒక్కసారిగా వాతావరణంలో ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో ప్రతి ఒక్కరూ ఎంతో అసౌకర్యంగా ఉంటారు. ఎండ తీవ్రత అధికమవుతున్న నేపథ్యంలో కరెంటు కోతలు కూడా అధికంగా ఉంటున్నాయి. దీంతో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉక్కపోతతో సతమతమవుతున్నారు. ఇలా ఉక్కపోతతో సతమతమవుతున్న ఓ వ్యక్తి చేసిన పని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

viral-video-man-spinning-of-a-table-fan-for-keep-cool-during-summer
viral-video-man-spinning-of-a-table-fan-for-keep-cool-during-summer

ఈ ఘటన ఎక్కడ జరిగింది అనే విషయం తెలియకపోయినప్పటికీ ఐఎఎస్ అధికారి అవనీష్ శరణ్ తన ట్విట్టర్‌ ఖాతాలో ఈ వీడియోని షేర్ చేస్తూ ‘ఈ టెక్నిక్ భారతదేశంను దాటి బయటకు వెళ్లొద్దు’ అని కాప్షన్ ఇచ్చారు. మరి ఈ వీడియోలో ఏముంది అనే విషయానికి వస్తే…వేసవి కాలం ఎండ తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో కరెంటు కోతలు కూడా అధికంగా ఉన్నాయి. ఈ క్రమంలోనే ఓ వ్యక్తి తన దగ్గర ఉన్న టేబుల్ ఫ్యాన్ రెక్కలను తనకు వీలైనంత బలంగా వాటిని తిప్పి బెడ్ పై పడుకుంటున్నారు.

ఆ ఫ్యాన్ తిరగడం ఆగిపోగానే మరోసారి వెళ్లి ఫ్యాన్ రెక్కలు తిప్పుతూ బెడ్ పై పడుకుంటున్నారు. ఇలా ప్రతిసారి చేస్తూ వేసవి తాపం నుంచి ఉపశమనం పొందుతున్నాడు. ఇలా ఈ వ్యక్తి చేసిన ఈ పనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ వీడియో చూసిన ఎంతో మంది నెటిజన్లు తమదైన శైలిలో ఈ వీడియో పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ వీడియో షేర్ చేసిన అతి తక్కువ సమయంలోనే లక్షల్లో వ్యూస్ దక్కించుకొని వేలల్లో లైక్స్ సంపాదించుకుంది. మరెందుకాలస్యం ఈ వీడియో పై మీరు ఓ లుక్కేయండి.

Advertisement

Read Also : Surekha Vani: కూతురితో కలిసి మందు తాగుతూ రచ్చ చేస్తున్న నటి సురేఖ వాణి… ఫోటో వైరల్!

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel