Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

Viral Video : ముసలి తాత డైరెక్షన్‌లో ప్రీ వెడ్డింగ్ షూట్.. సినిమా తీస్తే మాత్రం బ్లాక్ బస్టరే.. వీడియో వైరల్..!

Viral Video : త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు.. ఈ రోజుల్లో పెళ్లి చేసుకునే జంట ముందుగానే ప్రీ-వెడ్డింగ్ ఫొటో షూట్ ప్లాన్ చేసేస్తున్నారు. ఫొటోలకు ఫోజులిస్తూ తమ ముచ్చట తీర్చుకుంటుంటారు. ఇప్పుడు అలాంటి ఓ జంట తమ పెళ్లికి ముందు ప్రీ వెడ్డింగ్ ఫొటో‌షూట్ చేసుకోవాలని ప్లాన్ చేసుకున్నారు. అందుకు ఒక లొకేషన్ ఎంచుకున్నారు. అదంతా నది పరివాహిక ప్రాంతం.. అయితే వారికి ఓ విచిత్ర అనుభవం ఎదురైంది. ఆంధ్రాకు చెందిన ఆ జంట ప్రీ వెడ్డింగ్ ... Read more

By Vinod Kumar

Published on: January 23, 2023 12:22 PM

Updated on: January 23, 2023 12:26 PM

Viral Video _ Andhra old man Directed pre wedding Shoot of Pair Bridegroom on Boat (2)

---Advertisement---

Viral Video : త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు.. ఈ రోజుల్లో పెళ్లి చేసుకునే జంట ముందుగానే ప్రీ-వెడ్డింగ్ ఫొటో షూట్ ప్లాన్ చేసేస్తున్నారు. ఫొటోలకు ఫోజులిస్తూ తమ ముచ్చట తీర్చుకుంటుంటారు. ఇప్పుడు అలాంటి ఓ జంట తమ పెళ్లికి ముందు ప్రీ వెడ్డింగ్ ఫొటో‌షూట్ చేసుకోవాలని ప్లాన్ చేసుకున్నారు. అందుకు ఒక లొకేషన్ ఎంచుకున్నారు.

అదంతా నది పరివాహిక ప్రాంతం.. అయితే వారికి ఓ విచిత్ర అనుభవం ఎదురైంది. ఆంధ్రాకు చెందిన ఆ జంట ప్రీ వెడ్డింగ్ ఫొటో షూట్​ కోసం నదిలో ఓ పడవ ఎక్కింది. అయితే ఆ పడవపై ఒక ముసలి తాత కూడా ఉన్నాడు. ఆ పడవ నడిపేది అతడే.. తమ ప్రీ వెడ్డింగ్ షూట్ మొదలుపెట్టారు.

Viral Video _ Andhra old man Directed pre wedding Shoot of Pair Bridegroom on Boat (1)
Viral Video _ Andhra old man Directed pre wedding Shoot of Pair Bridegroom on Boat (1)

అంతే.. అక్కడ ఉన్న ముసలి తాతకు చిర్రెత్తుకొచ్చింది. వెంటనే సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఫొటో షూట్ ఎలా తీయాలో తానే డైరెక్షన్ చేశాడు. ఫొటోషూట్ స్టిల్స్ బాగా రావాలంటూ వారిద్దరికి పలు సూచనలు చేశాడు.నాటు పడవ నడిపే అతడి మాటలను చెప్పినట్టుగా వింటూ ఆ జంట కూడా ఫొటోషూట్ చేసింది.

ఎలా ఫొటోలకు ఫోజులివ్వాలో అతడు వారికి చెప్పడం చూస్తుంటే నవ్వులు పూయిస్తోంది. ముసలి తాత డైరెక్షన్‌లో ఆ జంట చేసిన ప్రీ వెడ్డింగ్ షూట్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు కూడా తెగ ఎంజాయ్ చేస్తున్నారు.

తాత ముసలోడే కానీ, డైరెక్షన్ బాగా చేస్తున్నాడుగా అంటూ కామెంట్లు చేస్తున్నాడు. తాత డైరెక్షన్ లో ఏదైనా సినిమా చేస్తే మాత్రం బ్లాక్ బస్టర్ అంటూ నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు. వైరల్ అవుతున్న వీడియోను మీరు కూడా ఓసారి లుక్కేయండి..

Read Also : Shocking Video : వామ్మో.. మొసలితో సయ్యాటలా? చివరికి ఏమైందో చూడండి.. షాకింగ్ వీడియో..!

, , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

RELEATED POSTS :

PM Modi Video : ‘ఫ్రెండ్‌షిప్ డే’ను గుర్తు చేస్తూ ప్రధాని మోదీ మరో వీడియో.. ఆగస్టు 7న ప్రతి ఒక్కరూ ఇలా చేయాలని పిలుపు!

PM Modi Video : ‘ఫ్రెండ్‌షిప్ డే’ను గుర్తు చేస్తూ ప్రధాని మోదీ మరో వీడియో.. ఆగస్టు 7న ప్రతి ఒక్కరూ ఇలా చేయాలని పిలుపు!

Bangaram Song : డీమాన్ పవన్-రీతూ చౌదరి ‘బంగారం’ సాంగ్ చూశారా? యూట్యూబ్‌లో ట్రెండింగ్.. కెమిస్ట్రీ అదిరిపోయింది!

Bangaram Song : డీమాన్ పవన్-రీతూ చౌదరి ‘బంగారం’ సాంగ్ చూశారా? యూట్యూబ్‌లో ట్రెండింగ్.. కెమిస్ట్రీ అదిరిపోయింది!

Telangana Jowar Farmers : తెలంగాణ రైతులకు బిగ్ రిలీఫ్.. అకౌంట్లలో డబ్బులు పడ్డాయ్.. ఇప్పుడే ఇలా చెక్ చేస్కోండి..!

Telangana Jowar Farmers : తెలంగాణ రైతులకు బిగ్ రిలీఫ్.. అకౌంట్లలో డబ్బులు పడ్డాయ్.. ఇప్పుడే ఇలా చెక్ చేస్కోండి..!

Amazon Great Freedom Sale : అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ 2026 : వన్‌ప్లస్ 15పై భారీ డీల్.. కొనాలనుకునేవారికి ఇదే గోల్డెన్ ఛాన్స్!

Amazon Great Freedom Sale : అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ 2026 : వన్‌ప్లస్ 15పై భారీ డీల్.. కొనాలనుకునేవారికి ఇదే గోల్డెన్ ఛాన్స్!

Gold Price Today : బంగారం ప్రియులకే పండగే.. భారీగా దిగొచ్చిన గోల్డ్ రేట్లు.. ఇప్పుడే కొనడం బెస్ట్!

Gold Price Today : బంగారం ప్రియులకే పండగే.. భారీగా దిగొచ్చిన గోల్డ్ రేట్లు.. ఇప్పుడే కొనడం బెస్ట్!

Hyderabad Metro : రోజూ హైదరాబాద్ మెట్రోలో ప్రయాణిస్తున్నారా? త్వరలో మంత్లీ, క్వార్టర్లీ పాస్‌లు.. విద్యార్థులు, ఉద్యోగులకు భారీ ఊరట!

Hyderabad Metro : రోజూ హైదరాబాద్ మెట్రోలో ప్రయాణిస్తున్నారా? త్వరలో మంత్లీ, క్వార్టర్లీ పాస్‌లు.. విద్యార్థులు, ఉద్యోగులకు భారీ ఊరట!