Guppedantha Manasu: తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో వసు పై రిషి కోప్పడడంతో జగతి వసుని ఓదారుస్తుంది.
ఈరోజు ఎపిసోడ్ లో జగతి వసు పై నీది ప్రేమ కాదంటావా అంటూ రిషి దాచుక్కున్న లెటర్ ని చూపిస్తుంది. అంతేకాకుండా ఇది కూడా నీ ప్రేమ కాదంటావా అని అడుగుతుంది. ఈ ఈ విషయాన్ని నిజం చేస్తావో అబద్ధం చేస్తావో నీ ఇష్టం అని చెప్పి జగతి అక్కడి నుంచి వెళ్లి పోతుంది.

ఆ తరువాత రిషి నేను అనవసరంగా వసు పై కోప్పడ్డాను.. తొందర పడ్డానా అని ఆలోచిస్తూ ఉంటాడు. మరొకవైపు వసు కూడా రిషి గురించి ఆలోచిస్తూ ఉండగా ఇంతలో వసు కి జగతి ఎదురవుతుంది. రిషి అన్న మాటలను అపార్థం చేసుకోవద్దని వసు కి సర్దిచెబుతుంది.
మరొకవైపు రిషి కోసం ఒక కొరియర్ వస్తుంది. ఆ కొరియర్ ని తీసుకున్న రిషి దానిని జగతి మేడం కు ఇవ్వండి అని చెప్పి మహేంద్రుడు ఇస్తాడు. మరొకవైపు దేవయాని సాక్షి కి లేనిపోని మాటలు అన్ని నూరిపోస్తూ సాక్షి ని మరింత రెచ్చగొడుతూ ఉంటుంది.
మరొకవైపు రిషి, వసు ని హాల్ టికెట్ కలెక్టర్ చేసుకున్నావా ఎప్పుడు వెళ్తున్నావ్ అని అడగడంతో వెళ్లడం ఏంటి సార్ మీరు రారా అని అడగగా ప్రతిసారి వేలు పట్టి నడిపించిన అవసరంలేదు అని అనడంతో అప్పుడు వసు బాధతో మహేంద్ర, ల దగ్గరికి వెళ్లి స్కాలర్షిప్ ఎగ్జామ్ దగ్గరికి రాను అని అంటున్నారు అని చెప్పి బాధపడుతుంది.
అప్పుడు మహేంద్ర వసు కి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తాడు. ఇక రేపటి ఎపిసోడ్ లో వసు, రిషి ఆల్ ద బెస్ట్ చెప్పలేదు అని బాధపడుతూ ఉంటుంది. జగతి, రిషి గురించి ఆలోచిస్తూ సాక్షి ఈ విషయంలో నలిగిపోతున్నాడు అని మనసులో అనుకుంటుంది. మరొకవైపు దేవయాని సాక్షి ఇద్దరూ వసు ని ఏదో చేయడానికి ప్లాన్ చేస్తారు. ఇక రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.
- Guppedantha Manasu: జగతి,మహేంద్రలను ఉండిపొమ్మని చెప్పిన రిషి.. షాక్ లో దేవయాని..?
- Guppedantha Manasu Dec 6 Today Episode : రిషి ఫ్యామిలీని వనభోజనాలకి ఇన్వైట్ చేసిన మినిస్టర్.. జగతిని అడ్డుకున్న దేవయాని..?
- Guppedantha Manasu july 18 Today Episode : సాక్షికి స్వీట్ గా వార్నింగ్ ఇచ్చిన వసు.. రిషి తెచ్చిన డ్రెస్ వేసుకున్న వసు..?















