Intinti Gruhalakshmi July 9 Today Episode : ఇంటింటి గృహలక్ష్మి.. లాస్యకు స్ట్రాంగ్‌గా బుద్ధి చెప్పిన తులసి.. ఫైనల్‌కి చేరుకున్న ప్రేమ్..?

Updated on: July 9, 2022

Intinti Gruhalakshmi July 9 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో తులసి లాస్యకు గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగ్య లాస్య కోసం ఎదురుచూస్తూ ఎక్కడికి వెళ్ళింది అని అనుకుంటూ ఉండగా ఇంతలోనా అక్కడికి వచ్చిన లాస్య ఎక్కడికి వెళ్లలేదు అని అంటుంది. నందునీ తులసి, ప్రేమ్ ఇద్దరూ అవమానపరిచారు కాబట్టి ప్రేమ్ ఎలాగైనా గెలవకుండా చేస్తాను అని అంటుంది. అప్పుడు వెంటనే భాగ్యమ్మన్ననే చెంప దెబ్బ కొట్టించుకున్నావు ఇప్పుడు మళ్లీ తులసి అక్క జోలికి వెళ్లడం అవసరమా అని అనడంతో వెంటనే లాస్య ఇవన్నీ పట్టించుకోకుండా ఎలా అయినా ప్రేమను ఓడించాలి అనుకుంటుంది.

Intinti Gruhalakshmi July 9 Today Episode
Intinti Gruhalakshmi July 9 Today Episode

అప్పుడు ఒక సిరప్ ని పట్టుకుని వస్తుంది. ఆ సిరప్ ని ప్రేమ తాగితే దగ్గుతూ ఉంటాడు పాట పాడకుండా ఓడిపోతాడు అని లాస్య అనడంతో భాగ్య భయపడుతూ ఉంటుంది. ప్రోగ్రామ్స్ స్టార్ట్ అవుతుంది. సింగర్స్ అందరూ ఒకచోట కూర్చొని ఉంటారు. ఇక అప్పుడు లాస్యతను తెచ్చిన సిరప్ ను ప్రేమ్ తాగే జ్యూస్ లో కలిపి ఏం తాగించేలా చేస్తుంది. ఇక లాస్య అనుకున్న విధంగా ప్రేమ్ జ్యూస్ తాగుతాడు.

Intinti Gruhalakshmi July 9 Today Episode : ఇంటింటి గృహలక్ష్మి.. ప్రేమ్‌కి గెలుపుపై నమ్మకం కలిగించిన తులసి !

ఆ తర్వాత సింగర్స్ అందరినీ ప్రోగ్రాం లోకి పిలుస్తారు. అప్పుడు ప్రేమ్ కు తులసి కుటుంబం అందరూ సంతోషంగా ఆల్ ది బెస్ట్ చెబుతారు. కానీ లాస్య మాత్రం తన ప్లాన్ వర్కౌట్ అవుతున్నందుకు సంతోష పడుతూ ఉంటుంది. మొదట ఒక వ్యక్తి వచ్చి పాట పాడగా అందరూ ఆ పాటకు ఫిదా అవుతారు. అందుకు కూడా అతడే గెలుస్తాడు అని అనుకుంటూ ఉంటాడు. ఇంతలో మరొక అమ్మాయి పాట పాడుతూ ఉండగా ఆ సమయంలో ప్రేమ్ కు దగ్గు రావడం మొదలవుతుంది. ఇక వెంటనే తులసి వేడి నీళ్లు తాగిస్తుంది. అయితే అదంతా గమనించిన లాస్య ప్రేమ్ పని అయిపోయినట్లే అని తెగ మురిసిపోతూ ఉంటుంది. ఆ తర్వాత ప్రేమ్ వెళ్లి పాట పాడడంతో అందరూ క్లాప్స్ కొడతారు ఇక ఫైనల్ రౌండ్ లో ప్రేమ్ పేరుతో పాటు మరొక వ్యక్తి పేరు కూడా ఉంటుంది.

Advertisement

అప్పుడు లాస్యకు దగ్గు రావడంతో ఇబ్బంది పడుతూ బయటికి వెళ్తుంది. అది చూసి తులసి లాస్య దగ్గరికి వెళ్లి ఆ జ్యూస్ తాగింది నువ్వే అది తాగించేలా చేసింది నేనే అని తన ప్లాన్ మొత్తం వివరించి చెబుతుంది. ఆ తర్వాత తులసినే ఆకులు లాస్యకు తులసి ఆకులు ఇచ్చి నయం చేస్తుంది. ఆ తర్వాత తులసి ప్రేమ్ కుమార్ ఇంత ధైర్యం చెబుతూ ఉంటుంది. కానీ లాస్య మాత్రం మరొక వ్యక్తికి ఓట్లు వేయమంటూ ప్రచారం చేస్తూ ఉంటుంది. ఇక ఫైనల్ గా ప్రేమ్ వేదికపైకి వెళ్లి అద్భుతంగా పాట పాడి అందరిని ఫిదా చేస్తాడు. ఆ తర్వాత కేవలం ఒకే ఒక్క ఓటింగ్ తేడాతో ఒక వ్యక్తి గెలుస్తాడు. అది ప్రేమ్ నా లేక వేరే వ్యక్తి అనేది తెలియాలి మరి.

Read Also : Intinti Gruhalakshmi July 8 Today Episode : సంతోషంలో తులసి కుటుంబం.. కావాలనే తులసితో గొడవ పెట్టుకున్న లాస్య..?

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel