TS Group 1 and 2 Aspirants : తెలంగాణలో ఎస్ఐ, గ్రూప్‌-1, 2 అభ్యర్థులకు శుభవార్త.. ఫ్రీ కోచింగ్.. స్టైఫండ్‌ కూడా! ఇప్పుడే అప్లయ్ చేసుకోండి..!

TS Group 1 and 2 Aspirants : తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నవారికి గుడ్‌న్యూస్.. త్వరలో రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు రానున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో పోటీ పరీక్షల కోసం ప్రీపేర్ అయ్యే అభ్యర్థుల కోసం రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ ఫ్రీగా కోచింగ్ అందించనుంది. ఇందుకోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా ప్రారంభమైంది.

ప్రీ కోచింగ్ కోసం రిజిస్ట్రర్ చేసుకునే అభ్యర్థుల వార్షిక ఆదాయం రూ.5లక్షల్లోపు ఉండాలి. ఏప్రిల్ 6 నుంచి ఏప్రిల్ 16వ తేదీలోపు ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏప్రిల్ 16న ఆన్ లైన్‌లో అర్హత పరీక్ష నిర్వహించనున్నారు. ఏప్రిల్ 21 నుంచి 1,25,000 మందికి ఫ్రీగా ట్రైనింగ్ అందించనున్నారు. గ్రూప్‌-1, గ్రూప్‌-2 కోసం ప్రీపేర్ అయ్యే 10వేల మంది అభ్యర్థులకు స్టైఫండ్‌ కూడా ఇవ్వనున్నారు.

ఈ మేరకు మంత్రి గంగుల కమలాకర్‌ ప్రకటించారు. గ్రూప్‌-1 అభ్యర్థుల కోసం 6నెలల పాటు నెలకు రూ.5వేలు, అలాగే గ్రూప్‌-2 అభ్యర్థులకు 3 నెలల పాటు నెలకు రూ.2వేలు, ఇక SI అభ్యర్థులకు నెలకు రూ.2వేల వరకు స్టైపెండ్‌ ఇవ్వనున్నట్లు మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు.

Advertisement

Read Also : ECIL Recruitment : నిరుద్యోగులకు శుభవార్త.. రాత పరీక్ష లేకుండానే ECIL లో 1625 ఉద్యోగాలు!

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel