TS BJP Strategy : కమలం గూటికి మరో ఉద్యమనేత.. తెర వెనుక రాజకీయం ఎవరిదో మరి? 

TS BJP Strategy : తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీని ఢీకొట్టేందుకు బీజేపీ బలమైన వ్యూహాలను రచిస్తున్నట్లు కనబడుతోంది. రోజురోజుకూ పార్టీని మరింత బలోపేతం చేసుకోవడంతో పాటు క్షేత్రస్థాయిలో దూకుడుగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలోనే అధికార టీఆర్ఎస్ పార్టీలోని అసంతృప్త నేతలను, ఉద్యమకారులకు గాలం వేసి మరీ తమ పార్టీలోకి తీసుకొచ్చేందుకుగాను ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ బలంతో రాష్ట్రంలోనూ బలపడాలని అనుకుంటున్నది బీజేపీ తెలంగాణ పార్టీ. ఈ క్రమంలోనే పార్టీ నేతలు సైతం దూకుడుగా వ్యవహరిస్తున్నారు. దానికి తోడు అధికార గులాబీ గూటిలో సీఎం కేసీఆర్ ఉద్యమకారులకు ప్రయారిటీ ఇవ్వడం లేదు. ఉద్యమ వ్యతిరేకులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. దాంతో ఉద్యమ కారులు పదవులు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఉద్యమకారులను ఏకం చేసేందుకుగాను బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారు.

ఇటీవల హుజురాబాద్ ఉప ఎన్నికలో ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఈటల రాజేందర్ ఉద్యమకారులను బీజేపీలోకి తీసుకొచ్చేందుకుగాను తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే టీఎస్‌పీఎస్‌సీ మాజీ సభ్యుడు, ఉద్యమకారుడు విఠల్, జర్నలిస్టులు తీన్మార్ మల్లన్న, రాణీ రుద్రమల చేరిక కన్ఫర్మ్ అయింది. ఈ క్రమంలోనే బీజేపీ భవిష్యత్తులో మరింత బలపడే చాన్సెస్ కనబడుతున్నాయి. సవాల్ విసిరి మరీ గెలిచిన ఈటల రాజేందర్ నాడు ఉద్యమంలో పని చేసిన నేతలను ఒక చోటుకు చేర్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement

ఇప్పటికే ఉద్యమకారుడిగా, ఉద్యోగుల సంఘం నాయకుడిగా పని చేసిన స్వామి గౌడ్ బీజేపీలో చేరారు. త్వరలో విఠల్ చేరుతున్నారు. మొత్తంగా బీజేపీ ఉద్యమకారులందరికీ వేదిక అయ్యే చాన్సెస్ కనబడుతున్నాయి. మొత్తంగా ఈ సారి అధికార టీఆర్ఎస్ పార్టీకి కాషాయం పార్టీ గట్టి పోటీ ఇవ్వడమే కాదు.. ఢీ అంటే ఢీ అన్న రీతిలోనే తలపడబోతున్నదన్న సంగతి పరిశీలనలో స్పష్టమవుతున్నందని పలువురు రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. చూడాలి వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక్లలో బీజేపీ ఏ మేరకు ప్రభావం చూపుతుందో మరి.

Read Also : Ys Jagan : 2024 ఎన్నికల్లో జగన్ దారెటు.. కేంద్రంలో ఏ కూటమికి మద్దతు..?

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel